అధ్వానంగా గ్రామీణ రోడ్లు

ABN , First Publish Date - 2022-04-26T05:06:55+05:30 IST

మండల వ్యాప్తంగా గతేడాది అక్టోబరు, నవంబరు నెలల్లో కురిసిన వర్షాలకు గ్రామీణ ప్రాంత రోడ్లు దెబ్బతిన్నాయి. ఆరు నెలలు గడుస్తున్నా అధికారులు, పాలకులు చొరవ చూపకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు గురవుతున్నారు.

అధ్వానంగా గ్రామీణ రోడ్లు
కోతకు గురైన దొడ్డిసిద్దయ్య గారిపల్లె నుంచి వల్లబండపల్లెకు వెళ్లే రోడ్డు మార్గం

6 నెలలుగా గుంతల రోడ్లలోనే ప్రయాణం

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

సంబేపల్లె, ఏప్రిల్‌ 25: మండల వ్యాప్తంగా గతేడాది అక్టోబరు, నవంబరు నెలల్లో కురిసిన వర్షాలకు గ్రామీణ ప్రాంత రోడ్లు దెబ్బతిన్నాయి. ఆరు నెలలు గడుస్తున్నా అధికారులు, పాలకులు చొరవ చూపకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు గురవుతున్నారు. శెట్టిపల్లె గ్రామ పరిధిలోని మారుమూల ప్రాంతాలైన దొడ్డిసిద్దయ్యగారిపల్లె నుంచి వళ్లబండపల్లెకు వెళ్లే రోడ్డు మార్గం, ఎర్రమొరంపల్లె నుంచి మర్రిమాకులపల్లెకు వెళ్లే రోడ్డు మార్గం, రెండు మూడు చోట్ల కోతకు గురైంది. తారు రోడ్డు నిర్మాణం కోసం కంకర, చిప్స్‌ పరిచిన రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. నిత్యం ఈ ప్రాంతంలో వెళ్లే ప్రజలు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఈ రోడ్లకు మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2022-04-26T05:06:55+05:30 IST