అధ్వానంగా ఎన్కెపల్లి రోడ్డు

ABN , First Publish Date - 2021-10-27T04:28:33+05:30 IST

ఎన్కెపల్లి రోడ్డు అధ్వానంగా మారింది.

అధ్వానంగా ఎన్కెపల్లి రోడ్డు
గుంతలమయంగా ఎన్కెపల్లి రోడ్డు

మొయినాబాద్‌ రూరల్‌: ఎన్కెపల్లి రోడ్డు అధ్వానంగా మారింది. గజానికో గుంతతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌-బీజాపూజ్‌ రహదారి హిమా యత్‌నగర్‌ చౌరస్తా నుంచి ఎన్కెపల్లి వెళ్లే రోడ్డు ఎక్కడికక్కడ తారులేచి పాడైంది. ఈ రోడ్డు వెంట ఎన్కెపల్లి, బాకారం, నాగిరెడ్డిగూడ గ్రామస్థులు నగరానికి వెళ్తుంటారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.



Updated Date - 2021-10-27T04:28:33+05:30 IST