అధ్వానంగా జగనన్న కాలనీలు

ABN , First Publish Date - 2021-09-01T13:25:43+05:30 IST

జగనన్న కాలనీలు చాలా అధ్వానంగా..

అధ్వానంగా జగనన్న కాలనీలు

బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ


బాపట్ల: జగనన్న కాలనీలు చాలా అధ్వానంగా ఉన్నాయని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇన్‌చార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ విమర్శించారు. మంగళవారం పట్టణంలోని టీచర్స్‌ కాలనీ వద్ద ఉన్న ఫ్యాడిసన్‌పేట జగనన్న కాలనీని వేగేశన నరేంద్రవర్మ పార్టీశ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ జగనన్న కాలనీలో పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. అరకొర సదుపాయాలతో అధ్వానంగా ఉన్న ఈ రోడ్డులో  చిన్నపాటి వర్షానికే నీరు నిలిచిపోయి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలా నీరు నిలిచిపోతుంటే గృహాలు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఇక్కడ ఎలా నివసిస్తారని ప్రశ్నించారు.   ప్రభుత్వం ప్రచార అర్భాటాలకే తప్ప పనిచేసే ప్రభుత్వం కాదన్నారు. గొప్పలు చెప్పుకోవడానికి హడావిడిగా భూమికొని, మెరకలు సరిగా చేయకుండా, కనీస సదుపాయాలు కల్పించకుండా లబ్ధిదారులకు అందజేశారన్నారు. లబ్ధిదారుడు ఇల్లు నిర్మాణం చేయకపోతే స్థలం వెనక్కి తీసుకుంటామని బెదిరించి వారితో ఇంటి నిర్మాణం చేపడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కాలనీల్లో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించిన తర్వాతే ఇంటి నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


కార్యక్రమంలో టీడీపీ బాపట్ల పట్టణాధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి విన్నకోట వీరయ్యనాయుడు, పట్టణ ఉపాధ్యక్షుడు బుర్లె రామసుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్‌బాబు, రాష్ట్ర తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి మానం విజేత, పార్లమెంటరీ అధికార ప్రతినిధి కొల్లూరి వెంకట్రావు, పార్లమెంటరీ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ఆడేవంశీ, బాపట్ల మండల అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు సలగల సురేష్‌, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు అబ్రహర్‌, పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షుడు సురగాని శేఖర్‌,  పట్టణ కోశాధికారి రమేష్‌, సీనియర్‌ నాయకులు లీలా కృష్ణ, ఊట్ల రామారావు, మందపాటి అంద్రేయ, యోన,  చివుకుల దుర్గాప్రసాద్‌, శాస్ర్తి, కిరణ్‌,ప్రసాద్‌, తాహిర్‌, భావన్నారాయణ, గోపి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-01T13:25:43+05:30 IST