అనంతపురం: వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం అధ్వానంగా తయారైంది. ఈ పథకానికి సంబంధించిన పాల ప్యాకెట్లలో పురుగులు బయటపడిన ఘటన అనంతలో వెలుగు చూసింది. గర్భిణులు, బాలింతలకు వీటిని పంపిణీ చేస్తున్నారు. దుర్వాసన వస్తున్నా అధికారులు వాటిని పంపిణీ కోసం తరలిస్తున్నారు. ప్రభుత్వ మిల్క్ డైరీ కార్యాలయం వద్ద తరలింపు దృశ్యాలు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కంటపడ్డాయి. కదిరిలో ఇటీవల భూమిలో పాల ప్యాకెట్లు బయటపడిన విషయం విదితమే. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.