Abn logo
Mar 4 2021 @ 01:31AM

19 ఏళ్ల లోపు వారందరికీ నులిపురుగుల నివారణ మందు

పాడేరులో బాలలకు నులిపురుగుల నివారణ మందు వేస్తున్న ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్‌

అన్ని విద్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో 9వ తేదీ వరకు నిర్వహణ

ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌


పాడేరు, మార్చి 3: ఏజెన్సీలో 19 ఏళ్లలోపు వయసున్న వారందరికీ నులిపురుగుల నివారణ మందు వేస్తామని ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌ అన్నారు. బుధవారం లోచలిపుట్టు ఆశ్రమ పాఠశాలలో, అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు నులిపురుగుల నివారణ మందులు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని విద్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈనెల తొమ్మిదో తేదీ వరకు నులిపురుగుల నివారణ మందులు వేస్తామని, ఇందుకు  వైద్యారోగ్య శాఖ, అంగన్‌వ్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు  సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెఈవోలు జి.సింహాద్రి, ఎన్‌.ప్రకాశ్‌, స్వచ్ఛమన్యం ప్రాజెక్టు మేనేజర్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


చింతపల్లి: ప్రభుత్వ, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు బుధవారం నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేసినట్టు ఆర్‌వీనగర్‌ వైద్యాధికారి గాయత్రి తెలిపారు. చింతపల్లిలోని బాలికలు, బాలుర ఆశ్రమ పాఠశాలల్లో డీవార్మింగ్‌ కార్యక్రమాన్ని సర్పంచ్‌ దురియ పుష్పలత ప్రారంభించారు. ఎంఎల్‌హెచ్‌పీ లోవతల్లి, పారామెడికల్‌ సిబ్బంది నెహ్రూ, విజయలక్ష్మి, దైవమణి పాల్గొన్నారు. 


గూడెంకొత్తవీధి: బాలబాలికలు డీవార్మింగ్‌ మందులు విధిగా వేసుకోవాలని పెదవలస వైద్యాధికారి కోమలి అన్నారు. బుధవారం స్థానిక ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు డీవార్మింగ్‌ మాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కడుపులో నులిపురుగులు వుంటే కడుపునొప్పి, రక్తహీనత, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయని, వీటి నివారణకు ప్రతి ఒక్కరూ నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో హెచ్‌వో శ్రీనివాసరావు, హెచ్‌వీ జుంబు రాణి పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement