ప్రపంచవ్యాప్తంగా కోటి 8 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-02T16:52:27+05:30 IST

ఎటు చూసిని కరోనా పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ..

ప్రపంచవ్యాప్తంగా కోటి 8 లక్షలు దాటిన కరోనా కేసులు

ఎటు చూసినా కరోనా పంజా విసురుతోంది. వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసులు కోటి 8 లక్షలు దాటాయి. అటు మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,08,03,599 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,18,968 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 59,39,017 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 27,79,953 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,30,798 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 11,64,680 మంది కోలుకున్నారు. మరిన్ని వివరాలకు పై వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2020-07-02T16:52:27+05:30 IST