ప్రపంచంలోనే స్వచ్ఛమైన గాలి దక్షిణ మహాసముద్ర ప్రాంతంలో!!

ABN , First Publish Date - 2020-06-04T08:14:17+05:30 IST

ప్రపంచంలోనే స్వచ్ఛమైన గాలిని అమెరికాలోని కొలరాడో స్టేట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎక్కడో తెలుసా ? భూమికి దక్షిణ ధ్రువంలోని మంచు ఖండం ‘అంటార్కిటికా’ను చుట్టి ఉండే దక్షిణ మహాసముద్ర ప్రాంతంలో...

ప్రపంచంలోనే స్వచ్ఛమైన గాలి దక్షిణ మహాసముద్ర ప్రాంతంలో!!

  • గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు


వాషింగ్టన్‌, జూన్‌ 3 : ప్రపంచంలోనే స్వచ్ఛమైన గాలిని అమెరికాలోని కొలరాడో స్టేట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎక్కడో తెలుసా ? భూమికి దక్షిణ ధ్రువంలోని మంచు ఖండం ‘అంటార్కిటికా’ను చుట్టి ఉండే దక్షిణ మహాసముద్ర ప్రాంతంలో!! ఈ మహా సముద్ర ఉపరితలంపై కేవలం 6,500 అడుగుల ఎత్తులో ఉండే ‘క్యుములో నింబస్‌’ మేఘాలు ఉంటా యి. సముద్రం నుంచి ఈ మేఘాల్లోకి వెళ్లే గాలిలోని బ్యాక్టీరియాను డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌, సోర్స్‌ ట్రాకింగ్‌, విండ్‌ బ్యాక్‌ ట్రాజెక్టరీస్‌ సాంకేతిక పద్ధతులతో శాస్త్రవేత్తలు పరీక్షించారు. దీంతో మహాసముద్రం పరిసరాల్లోని గాలి అత్యంత స్వచ్ఛంగా ఉన్నట్లు వెల్లడైంది. పరిసర దేశాలు, ఖండాల్లో విడుదలయ్యే కాలుష్య ఉద్గారాల ప్రభావంతోనూ ఈ మహాసముద్ర గాలి నాణ్యత దెబ్బతినడం లేదని వెల్లడించారు. 


Updated Date - 2020-06-04T08:14:17+05:30 IST