పాకిస్థాన్‌లోని ఒంటరి ఏనుగుకు విముక్తి.. 36 ఏళ్ల తర్వాత..

ABN , First Publish Date - 2020-11-30T05:16:21+05:30 IST

పాకిస్థాన్‌లో గత 36 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్న కావన్ అనే ఏనుగుకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఫోర్ పాస్ అనే జంతు

పాకిస్థాన్‌లోని ఒంటరి ఏనుగుకు విముక్తి.. 36 ఏళ్ల తర్వాత..

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో గత 36 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్న కావన్ అనే ఏనుగుకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఫోర్ పాస్ అనే జంతు సంక్షేమ గ్రుప్ కొద్ది గంటల క్రితం కావన్‌ను విమానంలో కాంబోడియాకు తరలించారు. ఇస్లామాబాద్ జూలో కావన్ ఒంటరిగా జీవిస్తున్నట్టు తెలుసుకున్న అమెరికన్ పాప్ స్టార్ చేర్ ఏనుగుకు విముక్తి కలిగించేందుకు పోరాడారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా కావన్‌ను కాంబోయాకు తరలించే ప్రక్రియలో సహాయం అందించారు. గత శుక్రవారం చేర్ ఇమ్రాన్‌ఖాన్‌తో భేటీ అయి సహాయం అందించినందుకు ధన్యావాదాలు తెలిపారు. అదే సమయంలో కావన్‌ను కాంబోడియాకు తరలించేందుకు ముందుకొచ్చిన చేర్‌కు ఇమ్రాన్‌ఖాన్ అభినందనలు చెప్పారు. 


కొద్ది గంటల క్రితం కావన్‌ను విమానంలో తరలించగా.. తన కోరిక ఎట్టకేలకు నిజమైందంటూ చేర్ ఆనందం వ్యక్తం చేశారు. కావన్‌ను కాంబోడియాకు తరలించే క్రమంలో ఫోర్ పాస్ సంస్థ ఎంతో శ్రమపడింది. కావన్ ఏడు గంటల విమాన ప్రయాణం చేయాల్సి ఉండటంతో ప్రత్యేకంగా మెటల్ ట్రాన్స్‌పోర్ట్ క్రేట్‌ను నిపుణుల చేత తయారీ చేయించారు. గత కొద్ది నెలలుగా ఫోర్ పాస్ సంస్థ ఈ మెటల్ క్రేట్‌లో కావన్ గంటల సేపు ఉండేలా ట్రైనింగ్ ఇచ్చింది. భారీ శరీరం కలిగి ఉండటంతో కావన్‌ను లారీలోకి ఎక్కించి ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా నిపుణులు కష్టపడాల్సి వచ్చింది. ఇక ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రష్యాకు చెందిన జంబో జెట్‌లో కావన్‌ను కాంబోడియాలోని సియోమ్ రీప్ ప్రావిన్స్‌కు తీసుకెళ్తున్నారు. అక్కడ అనేక ఇతర ఏనుగులతో పాటు కావన్ కలిసి జీవించనుంది.

Updated Date - 2020-11-30T05:16:21+05:30 IST