అది మహానగరాన్ని తలపించే అతిపెద్ద క్రూయిజ్.. దాని ప్రత్యేకతలు తెలిస్తే..

ABN , First Publish Date - 2022-02-02T13:27:34+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ ‘వండర్ ఆఫ్ ది సీస్’ తొలిసారిగా..

అది మహానగరాన్ని తలపించే అతిపెద్ద క్రూయిజ్.. దాని ప్రత్యేకతలు తెలిస్తే..

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ ‘వండర్ ఆఫ్ ది సీస్’ తొలిసారిగా సముద్రపు అలలపై పయనించి ఐరోపాలోని లిమాసోల్‌కు చేరుకుంది. ఫ్రాన్స్‌లోని సెయింట్ నజైర్‌లో మూడేళ్ల కాలంలో రూపుదిద్దుకున్న ఈ క్రూయిజ్ 10 అంతస్తులను కలిగి ఉంది. ఇది భారీగా ఉండటంతో దీనికి 'ఫ్లోటింగ్ సిటీ' అనే పేరు కూడా పెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్దదయిన ఈ క్రూయిజ్ పొడవు 1,185 అడుగులు. దీని బరువు 2,36,857 టన్నులు. ఈ క్రూయిజ్ కేవలం సముద్ర ప్రయాణం కోసం మాత్రమే నిర్మింత కాలేదు. ఇందులో ఉండేవారికి తాము ఒక పెద్ద నగరంలో నివసిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ క్రూయిజ్‌లో సముద్రం మీద తేలియాడే మొదటి లివింగ్ పార్క్ ఉంది. ఇందులో 20 వేలకు పైగా మొక్కలు ఉన్నాయి. వండర్ ఆఫ్ ది సీస్‌లో 18 డెక్‌లు, 24 గెస్ట్ ఎలివేటర్లు, 2,867 స్టేట్ రూమ్‌లు ఉన్నాయి. 




వాటిలో దాదాపు 7 వేల మంది అతిథులు బస చేయవచ్చు. 64 మీటర్ల వెడల్పు ఉన్న ఈ క్రూయిజ్‌లో అతిథులే కాకుండా 2300 మంది సిబ్బంది బస చేసేందుకు కూడా స్థలం ఉంది. ఆహార ప్రియులకు ఇక్కడ అనేక రకాల ఆహారాలు దొరుకుతాయి. ఈ భారీ షిప్‌లో 20 రెస్టారెంట్లు, 11 బార్‌లు కూడా ఉన్నాయి. డెయిలీ మెయిల్ తెలిపిన వివరాల ఈ క్రూయిజ్‌ అధిపతి, రాయల్ కరీబియన్ గ్రూప్ సీఈఓ జాసన్ లిబర్టీ మాట్లాడుతూ ‘వండర్ ఆఫ్ ది సీస్’లో ప్రయాణం ప్రయాణికులకు మెరుగైన క్రూయిజ్ అనుభవాన్ని ఇస్తుందన్నారు. ఇందులో కొత్త ఆవిష్కరణలు ఉన్నాయన్నారు. దీని సహాయంతో పర్యాటకంతో పాటు ఆర్థిక వ్యవస్థకు ఊపు వస్తుందన్నారు. కాగా ఈ క్రూయిజ్‌ను అధికారికంగా 2022 మార్చి 4న ప్రారంభించనున్నారు. ఈ క్రూయిజ్‌లో ప్రయాణీకులు నడవడానికి జాగింగ్ ట్రాక్, ఆడుకునేందుకు మినీ గోల్ఫ్, అవుట్‌డోర్ మూవీ స్క్రీన్, స్పా లాంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. 

Updated Date - 2022-02-02T13:27:34+05:30 IST