IPL Final Day: ప్రపంచంలోనే అతిపెద్ద జెర్సీని ఆవిష్కరించిన BCCI.. గిన్నిస్ రికార్డ్

ABN , First Publish Date - 2022-05-30T02:09:05+05:30 IST

ఐపీఎల్ (IPL) ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్రమోదీ స్టేడియంలో అతి పెద్ద

IPL Final Day: ప్రపంచంలోనే అతిపెద్ద జెర్సీని ఆవిష్కరించిన BCCI.. గిన్నిస్ రికార్డ్

అహ్మదాబాద్: ఐపీఎల్ (IPL) ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్రమోదీ స్టేడియంలో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ జెర్సీని ఆవిష్కరించారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి దీనిని ఆవిష్కరించాడు. ఈ అతిపెద్ద జెర్సీతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినట్టు చెప్పాడు. దీని పొడవు, వెడల్పులు 66X42 మీటర్లని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధులు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, జై షాలకు ధ్రువీకరణ పత్రం అందించారు. 


కాగా, మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ముగింపు వేడుకలు అలరించాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ‌వీర్ సింగ్ పలు హిందీ పాటలతోపాటు ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు నాటు..’ పాటకు డ్యాన్స్‌లేసి ప్రేక్షకులను ఉత్సాహపరిచాడు. అలాగే, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ గాయని నీతి మోహన్ తన బృందంతో పలు హిట్ పాటలు పాడి అలరించారు. ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన వారితో స్టేడియం కిక్కిరిసిపోయింది.



Updated Date - 2022-05-30T02:09:05+05:30 IST