Bill Gates: కరోనా తరహాలోనే మానవాళిపై మరో మహమ్మారి విరుచుకుపడే ప్రమాదం!

ABN , First Publish Date - 2022-02-22T13:02:25+05:30 IST

టీకాల కారణంగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ.. భవిష్యత్తులో ఇదే తరహాలో మరో మహమ్మారి మానవాళిపై విరుచుకుపడే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ హెచ్చరించారు.

Bill Gates: కరోనా తరహాలోనే మానవాళిపై మరో మహమ్మారి విరుచుకుపడే ప్రమాదం!

ఇంటర్నెట్ డెస్క్: టీకాల కారణంగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ.. భవిష్యత్తులో ఇదే తరహాలో మరో మహమ్మారి మానవాళిపై విరుచుకుపడే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ హెచ్చరించారు. అది కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌ కాకుండా వేరే వైర్‌సల కారణంగా రావచ్చని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆరోగ్యసంరక్షణ రంగం మరింత పురోభివృద్ధి చెందుతుందన్న ఆయన.. ఇందుకు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను ఉదాహరణగా చూపారు. కొత్తగా వచ్చే మహమ్మారిని ఎదుర్కోవడానికి కావాల్సిన ఖర్చు కూడా అంత ఎక్కువగా ఉండబోదని స్పష్టం చేశారు. అప్రమత్తంగా ఉంటే దాన్ని ముందే గుర్తించి ఎదుర్కోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-02-22T13:02:25+05:30 IST