మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: రష్యా మీడియా

ABN , First Publish Date - 2022-04-16T01:05:52+05:30 IST

మాస్కో : రష్యా- ఉక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా అధికారిక మీడియా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మూడవ ప్రపంచ యుద్ధ ఇదివరకే మొదలైందని రష్యా ప్రధాన అధికారిక మీడియా ‘రష్యా 1’ పేర్కొంది.

మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: రష్యా మీడియా

మాస్కో : రష్యా- ఉక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా అధికారిక మీడియా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మూడవ ప్రపంచ యుద్ధ ఇప్పటికే మొదలైందని రష్యా ప్రధాన అధికారిక మీడియా ‘రష్యా 1’ పేర్కొంది. రష్యా యుద్ధ నౌక మొస్క్వా మునిగిపోయిన తర్వాత ఈ యుద్ధం ఆరంభమైందని వ్యాఖ్యానించింది. నౌక మునకతో రష్యా ప్రధాన ఆలోచన పక్కదారి పట్టిందని హెచ్చరించింది. కాగా యుద్ధ నౌక అగ్నిప్రమాదం కారణంగా ముగినిపోయిందని రష్యా చెబుతుండగా.. తామే కూల్చివేశామని ఉక్రెయిన్ ప్రకటించుకుంది. రష్యా బ్లాక్ సీ ఫ్లీట్‌కు చెందిన యుద్ధనౌకను నెప్ట్యూన్ క్షిపణితో కూల్చివేశామని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా మీడియా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.


నౌక మునక పరిస్థితులను మూడో ప్రపంచయుద్ధంగా పిలవొచ్చునని, ఇది ఖచ్చితంగా జరుగుతుందని న్యూస్ ప్రజెంటర్ ఓల్గా స్కాబెయేవా తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం నాటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో రష్యా పోరాడుతున్నట్టే భావించాలని, ఈ అంశాన్ని గుర్తించాల్సి ఉందని ఆమె పేర్కొంది. ఇక టీవీ చర్చలో పాల్గొన్న ఓ అతిథి స్పందిస్తూ... యుద్ధ నౌక  మొస్క్వా మునకను రష్యా గడ్డపై జరిగిన దాడిగా అభివర్ణించారు. టీవీ వ్యాఖ్యాతలు కూడా ఇదే తరహా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై దాడులు మరింత ఉదృతమవుతాయని హెచ్చరించారు. బాంబుల దాడులు ఉధృతమవడంతోపాటు చర్చలు నిలిపివేసేందుకు అవకాశాలున్నాయని అన్నారు. చర్చలు నిలిపివేయడం కూడా ఉక్రెయిన్‌పై బాంబు వేయడంగానే వారు అభివర్ణించారు. కాగా ఈ చర్చకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Updated Date - 2022-04-16T01:05:52+05:30 IST