‘టెస్టు’ ఫైనల్‌ తేదీ మారింది..

ABN , First Publish Date - 2021-01-26T08:27:43+05:30 IST

తొలిసారిగా నిర్వహించబోతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ తేదీని మార్చారు. లార్డ్స్‌ మైదానంలో ఈ ఏడాది జూన్‌ 18 నుంచి 22 వరకు ఈ మ్యాచ్‌ జరుగనుంది...

‘టెస్టు’ ఫైనల్‌ తేదీ మారింది..

  • జూన్‌ 18 నుంచి 22 వరకు 


న్యూఢిల్లీ: తొలిసారిగా నిర్వహించబోతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ తేదీని మార్చారు. లార్డ్స్‌ మైదానంలో ఈ ఏడాది జూన్‌ 18 నుంచి 22 వరకు ఈ మ్యాచ్‌ జరుగనుంది. వాస్తవానికి ఈ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ జూన్‌ 10 నుంచి 14 వరకు జరగాల్సింది. అయితే కరోనా ప్రభావంతో పాటు ఐపీఎల్‌ ఫైనల్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేశారు. ఆటగాళ్లను కూడా క్వారంటైన్‌లో ఉంచాలి కాబట్టి కాస్త సమయం తీసుకుంటే మంచిదని షెడ్యూల్‌ను వారం రోజులపాటు వెనక్కి జరిపారు.


భారత్‌కు ఫైనల్‌ బెర్త్‌ ఖాయమే..!

టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ కోసం భారత్‌, న్యూజిలాండ్‌, ఆస్ర్టేలియా, ఇంగ్లండ్‌ జట్లు పోటీలో ఉన్నాయి. మిగిలిన జట్లకు దాదాపుగా అవకాశాలు లేవు. అయితే ఇటీవలే ఆసీ్‌సను మట్టికరిపించి సిరీస్‌ గెలిచిన భారత్‌ దాదాపుగా టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌కు చేరినట్టే. ప్రస్తుతం పట్టికలో భారత్‌ 430 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. ఓవరాల్‌గా కోహ్లీ సేన మరో 75 పాయింట్లు సాధిస్తే చాలు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప లేదా 3-0, 3-1, 2-0తో గెలిచినా నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. రెండో ర్యాంకులో ఉన్న కివీస్‌ 420 పాయింట్లతో ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న ఆసీస్‌ ఫైనల్‌పై ఆశలు పెట్టుకోవాలంటే దక్షిణాఫ్రికాతో జరిగే సిరీ్‌సను 2-0తో గెలవాల్సి ఉంటుంది. కొవిడ్‌-19 కారణంగా గతేడాది ఈ టెస్టు చాంపియన్‌షి్‌ప పాయింట్ల పద్దతిని మార్చిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-01-26T08:27:43+05:30 IST