ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం

ABN , First Publish Date - 2020-07-08T20:32:19+05:30 IST

ప్రపంచంలో 40పైగా దేశాలలో ఉన్న తానా మరియు 50 తెలుగు సంఘాలన్ని కలిపి జులై 24, 25 మరియు 26 తేదీలలో తెలుగు సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం

ప్రపంచంలో 40పైగా దేశాలలో ఉన్న తానా మరియు 50 తెలుగు సంఘాలన్ని కలిపి జులై 24, 25 మరియు 26 తేదీలలో తెలుగు సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభించి జన సమూహాలు నిర్వహించటానికి ఉన్న పరిమితులను దృష్టిలో పెట్టుకుని పుర్తిగా వ‌ర్చువ‌ల్‌ పద్దతిలో జూం కాల్లో పొటీలను నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ తూనుగుంట్ల శిరీష తెలిపారు. ఈ పోటీలు ప్ర‌ధానంగా 8 విభాగాలలో 22 కేటగిరిలలో ఉంటాయి. 3 సంవత్సరముల నుండి 60+ సంవత్సరముల వరకు మహిళలు మరియు పురషులు పాల్గొనవచ్చు. పాల్గొనదలచిన వారు జూలై 21లోపు ఆన్ లైన్లో రిజిస్టర్ చెసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు ఆయా దేశాలలో ఉన్న కో-ఆర్డినేటర్లను లేదా worldteluguculturalfest@tana.orgని ఈమెయిల్ ద్వారా సంప్రదించగలరు.     


ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌లో ఆంధ్రప్రదేశ్‌ మాజీ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విజయ భాస్కర్ ముఖ్య పాత్ర పోషిస్తుండ‌గా, ప్రముఖ సాంస్కృతిక సంఘం జిగ్నాస వారు నిర్వహణకు కావలసిన సహకారాన్ని అందిస్తున్నారు. ఈ పోటీల్లో సౌందర్యలహరి, తెలుగు వెలుగు, రాగమంజరి, నాదామృతం, అందెల రవళి, కళాకృతి, రంగస్థలం, భువన విజయం ప్ర‌ధాన విభాగాలు ఉన్నాయి.  పాల్గొనదలచిన ఈ క్రింద ఇవ్వబడిన లింకులో వారి వివరాలను నమోదు చెసుకోగలరు.

tiny.cc/WTCFReg20

మరిన్ని వివరాలకు ఈ క్రింద ఇచ్చిన లింకులో గైడ్ లైన్స్ ను చదవగలరు.  

https://bit.ly/WTCFGuidelines

Updated Date - 2020-07-08T20:32:19+05:30 IST