విట్‌లో ప్రపంచ శరణార్థుల దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2021-06-22T08:39:41+05:30 IST

ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విట్‌-ఏపీ క్యాంప్‌సలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ వేడుకలకు భారత్‌లో ఐక్యరాజ్యసమితి

విట్‌లో ప్రపంచ శరణార్థుల దినోత్సవ వేడుకలు

అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విట్‌-ఏపీ క్యాంప్‌సలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ వేడుకలకు భారత్‌లో ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ(యూఎన్‌హెచ్‌సీఆర్‌) సీనియర్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ యూనికో కోయామా హజరయ్యారు. ఈ సందర్భంగా దీర్ఘకాలిక విభేదాలు, హక్కుల ఉల్లంఘనల కారణంగానే శరణార్థుల సంక్షో భం పెరుగుతోందని, ఫలితంగా బలవంతపు వలస లు పెరుగుతున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. విట్‌ వర్సిటీ, విట్‌ కాలేజ్‌ ఆఫ్‌ లా, సెంటర్‌ ఫర్‌ స్టేట్‌లె్‌సనెస్‌ అండ్‌ రెఫ్యూజీ స్టడీస్‌, ముంబైకి చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ స్టడీ్‌స(టీఐఎ్‌సఎ్‌స),యూఎన్‌హెచ్‌సీఆర్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో టీఐఎ్‌సఎస్‌ డీన్‌ అరవింద్‌ తివారీ, సీఎ్‌సఆర్‌ఎస్‌ చైర్మన్‌ పరివలన్‌, వీఎస్‌ఎల్‌ డీన్‌ డాక్టర్‌ బెనర్జీ, విట్‌-ఏపీ వర్సిటీ వీసీ కోటారెడ్డి, రిజిస్ట్రార్‌ శివకుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T08:39:41+05:30 IST