చక్రాసనంతో రికార్డు!

ABN , First Publish Date - 2020-02-13T05:58:51+05:30 IST

నిరాలంబ పూర్ణ చక్రాసనం...ఈ ఆసనం వేయాలంటే శరీరం విల్లులా వంగాలి. యోగా నిత్యం ప్రాక్టీసు చేసే వాళ్లు ఒక్కసారైనా ఈ ఆసనాన్ని వేయాలని ప్రయత్నం చేస్తుంటారు.

చక్రాసనంతో రికార్డు!

నిరాలంబ పూర్ణ చక్రాసనం...ఈ ఆసనం వేయాలంటే శరీరం విల్లులా వంగాలి. యోగా నిత్యం ప్రాక్టీసు చేసే వాళ్లు ఒక్కసారైనా ఈ ఆసనాన్ని వేయాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ చాలా మంది విషయంలో సాధ్యం కాదు. అయితే ఉత్తరాఖండ్‌లోని గౌలాపూర్‌కు చెందిన పదకొండేళ్ల రియాపలాడియా మాత్రం అలవోకగా ఈ ఆసనాన్ని వేస్తుంది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఏకంగా 21 సార్లు నిరాలంబ పూర్ణచక్రాసనం వేసి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఆ బాలిక శరీరం విల్లులా వంగే తీరు, ఆ వేగం చూసి యోగా నిపుణులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఆసనం వేసే సమయంలో చేతులతో ఏ మాత్రం సపోర్టు తీసుకోకుండా విల్లులా కిందకు వంచి పైకి లేవాల్సి ఉంటుంది. రియా పలాడియా అలా ఏకంగా నిమిషం సమయంలో 21 సార్లు చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. భవిష్యత్తులో యోగాలో మరిన్ని రికార్డులు నెలకొల్పుతానని ధీమాగా చెబుతున్న రియాను మనమూ అభినందిద్దామా!

Updated Date - 2020-02-13T05:58:51+05:30 IST