విజేతలు జొకోవిచ్‌, హలెప్‌

ABN , First Publish Date - 2020-09-22T09:39:15+05:30 IST

వరల్డ్‌ నెంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఖాతాలో 36వ ఏటీపీ టైటిల్‌ చేరింది.

విజేతలు జొకోవిచ్‌, హలెప్‌

ఇటాలియన్‌ ఓపెన్‌


రోమ్‌: వరల్డ్‌ నెంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఖాతాలో 36వ ఏటీపీ టైటిల్‌ చేరింది. సోమవారం జరిగిన ఇటాలియన్‌ ఓపెన్‌ పురుషుల ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ డియోగో ష్వార్జ్‌మన్‌తో తలపడిన జొకో చెమటోడ్చి నెగ్గాడు. తొలి సెట్‌లో తొలుత 0-3తో వెనుకబడిన సెర్బియా యోధుడు ఆతర్వాత పుంజుకొని 7-5తో పైచేయి సాధించాడు. రెండో సెట్‌ ఆరంభంలోనూ ప్రత్యర్థి నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైన తన అనుభవంతో జొకో 6-3తో గేమ్‌ను కైవసం చేసుకొని కెరీర్‌లో 5వ ఇటాలియన్‌ ట్రోఫీని ముద్దాడాడు. ఇక, మహిళల సింగిల్స్‌లో సిమోనా హలెప్‌ ఎట్టకేలకు తన మూడో ప్రయత్నంలో ఇటాలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగుతుందని భావించిన ఫైనల్లో రెండో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా గాయంతో వాకోవర్‌ ఇవ్వడంతో హలె్‌పకు తేలికగానే ట్రోఫీ చిక్కింది. తొలి సెట్‌ను హలెప్‌ 6-0తో దక్కించుకోగా రెండో సెట్‌ 2-1తో ఉన్న తరుణంలో ప్లిస్కోవా వెన్ను నొప్పితో ఆట నుంచి వైదొలిగింది. 

Updated Date - 2020-09-22T09:39:15+05:30 IST