ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం

ABN , First Publish Date - 2021-04-11T05:06:36+05:30 IST

ప్రత్తి పాడు ఆకుల శ్రీరాములు హోమియో మెడికల్‌ కళాశాలలో ప్రతీరోజు ఉద యం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందిస్తున్న ఉచిత హోమి యో వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కళాశాల చైౖర్మన్‌ డాక్టర్‌ విజయవర్దన్‌ అన్నారు.

ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం
నిడదవోలులో హోమియో మందు వేస్తున్న ఎస్‌ఐ జగదీశ్వరరావు

పెంటపాడు, ఏప్రిల్‌, 10 : ప్రత్తి పాడు ఆకుల శ్రీరాములు హోమియో మెడికల్‌ కళాశాలలో ప్రతీరోజు ఉద యం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందిస్తున్న ఉచిత హోమి యో వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కళాశాల చైౖర్మన్‌ డాక్టర్‌ విజయవర్దన్‌ అన్నారు. కళాశాల ప్రాంగణంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. హోమియో వైద్యపితామహుడు డాక్ట ర్‌ క్రిస్టియన్‌ ఫ్రెడ్‌రిచ్‌ శామ్యూల్‌ హనీమన్‌ జయంతి సదర్భంగా చిత్రప టానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్‌ లూక్‌అజోరియూ, డాక్టర్‌ డి..సురేంద్రకుమార్‌, డాక్టర్‌ ధనాల సాయిరాం, డాక్టర్‌ ప్రవీణకుమారి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

175 మందికి ఉచిత వైద్య పరీక్షలు 

నిడదవోలు, ఏప్రిల్‌ 10 :రోటరీ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగ పర్చుకోవాలని పట్టణ ఎస్‌ఐ జగదీశ్వరరావు అ న్నారు. నిడదవోలు రోటరీ ఆడిటోరియమ్‌లో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో రాజమండ్రి డాక్టర్‌ అల్లూరామ లింగ య్య హోమియో వైద్య కాలేజి వైద్యులచే ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా ఉచిత హో మియో వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో సుమారు 175 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశా రు. క్లబ్‌ అధ్యక్షుడు గాజుల రంగా రావు, కార్యదర్శి కందకట్ల అయ్యప్ప గుప్త, గోపిరెడ్డి శ్రీనివాస్‌,  చిలకల మల్లికార్జునరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T05:06:36+05:30 IST