ఆ రెండు కలిపితే ప్రాణాంతకమే

ABN , First Publish Date - 2020-05-27T07:07:21+05:30 IST

ఆ రెండు కలిపితే ప్రాణాంతకమే

ఆ రెండు కలిపితే ప్రాణాంతకమే

  • హైడ్రాక్సీక్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌పై పరిశోధనల్లో వెల్లడి


న్యూఢిల్లీ మే 26: కరోనా చికిత్సలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హైడ్రాక్సీక్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌ అనే రెండు రకాల ఔషధాలను సూచిస్తున్నారు. ఈ రెండు ఔషధాలను కలిపి(కాంబినేషన్‌) తీసుకుంటే మాత్రం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని వాండర్‌బిల్ట్‌, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం 1967 నవంబరు 14-2020 మార్చి 1 మధ్య వివిధ రకాల వ్యక్తుల నుంచి సేకరించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వద్ద ఉన్న 2.1 కోట్ల నివేదికలను విశ్లేషించారు. వీటి ప్రకారం హైడ్రాక్సీక్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌ ఔషధాలను కలిపి తీసుకుంటే  గుండె వైఫల్యానికి దారితీయవచ్చని వెల్లడైంది.

Updated Date - 2020-05-27T07:07:21+05:30 IST