తాజా పరిణామాలతో... ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ 'స్నాప్' * RRBI డిప్యూటీ గవర్నర్ మైఖేల్

ABN , First Publish Date - 2022-06-24T22:00:30+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడి, కోవిడ్ -19 పరిణామాల నేపథ్యంలో... ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ 'స్నాప్' అయ్యే ప్రమాదమేర్పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా పరిణామాలతో...   ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ  'స్నాప్'  * RRBI డిప్యూటీ గవర్నర్ మైఖేల్

ముంబై : ఉక్రెయిన్‌పై రష్యా దాడి, కోవిడ్ -19 పరిణామాల నేపథ్యంలో... ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ 'స్నాప్' అయ్యే ప్రమాదమేర్పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రేక్షకులుగా ఉన్నప్పటికీ... రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భారాన్ని ఎమర్జింగ్ మార్కెట్లు భరించాల్సి ఉంటుందని ఇండస్ట్రీ బాడీ PHD ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాత్రా పేర్కొన్నారు. గ్లోబల్ ఎకానమీ ఇప్పటివరకు చూడని అత్యంత సమన్వయంతో కూడిన ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే చక్రాన్ని చూస్తోందని, ఆర్‌బీఐ ఆర్థికవ్యవస్థ భరించగలిగినప్పుడు ధరల పరిస్థితిని స్థిరీకరించడానికి ప్రయత్నిస్తోందని పాత్ర పేర్కొన్నారు. కాగా... RBI సంబంధిత ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించిందని, ఇది 40 బేసిస్ పాయింట్ల ఆఫ్-సైకిల్ రేట్ పెంపును అనుసరించిందని, ఇది కేవలం ఒక నెల వ్యవధిలో 90 bps రేటు పెంపుదల జరిగిందని పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-24T22:00:30+05:30 IST