Advertisement
Advertisement
Abn logo
Advertisement

భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

ఇందుకూరుపేట, డిసెంబరు 3 : మండలంలోని కొత్తూరు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలోని భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వనరుల కేంద్రంలో శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల విద్యార్థులకు ఆటపాటలు, వివిధ రకాల పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ముఖ్యఅతిథులుగా సురేష్‌రెడ్డి, బుజ్జిబాబు, వేగుళ్ల భానుచంద్ర, ఎంఈవో శ్రీహరిబాబు, ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున, కొత్తూరు జడ్పీ  హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు మీనాకుమారి, ఐఈడీఎస్‌ నరసాపురం జడ్పీ హైస్కూల్‌, సీఆర్‌పీలు బాలసుబ్రహ్మణ్యం, హరికృష్ణ, ప్రశాంతి, మల్లికార్జున, శివప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భవిత కేంద్రం ఐఈఆర్‌టీ కావ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 

బుచ్చిరెడ్డిపాళెం : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం బుచ్చిరెడ్డిపాళెంలోని భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులు వివిధ రూపాలతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. విజేతలకు 11వ వార్డు కౌన్సిలర్‌ రాచూరి సత్యనారాయణ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరసింహారావు, గండికోట సుధీర్‌కుమార్‌, ఉపాధ్యాయులు, ఫిజియోథెరపి  దుర్గా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే బుచ్చి అంబేద్కర్‌ నగర్‌లోని మదర్‌ హోంలో అనాథ పిల్లలకు ఐక్యా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో  ఇసుకపల్లి సుబ్బారెడ్డి తల్లి నాగమ్మ వర్ధంతి సందర్భంగా ఆశ్రమ పిల్లలకు పండ్లు, బిస్కెట్లు, ఆహార పదార్థాలు, వంట పాత్రలు పంపిణీ చేశారు.

మనుబోలు: దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక ఉన్నత పాఠశాలలో ఉన్న భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు   పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు నాగజ్యోతి దుప్పట్లు పంపిణీ చేశారు. రాజవోలుపాడు ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్‌రెడ్డి, వల్లూరు వంశీకృష్ణారెడ్డి అనే దాతలు భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి విద్యాశాఖాధికారి బాలకృష్ణారెడ్డి, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు డేవిడ్‌, వసంతకుమారి, కేంద్రం కో-ఆర్టినేటర్లు శ్యామల, షర్మిల, అసిస్టెంట్‌ మల్లికార్జున పాల్గొన్నారు. 

పొదలకూరు : అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు శుక్రవారం ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈవో బాలకృష్ణ మాట్లాడుతూ మానసిక, శారీరక వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం వీరి కోసం ఎన్నో సదుపాయాలు కల్పిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  భవిత కేంద్రంలో స్పీచ్‌, ఫిజియో థెరపి సేవలు అందించడంతో పాటు ఎక్సార్ట్‌, ట్రాన్స్‌పోర్టు అలవెన్స్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పొదలకూరు బాలికల హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు ఎం.పెర్సిస్‌, రామ్‌నగర్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు ఉమాశంకర్‌, ఉపాధ్యాయులు   పాల్గొన్నారు. 


మనుబోలు: దివ్యాంగుడికి బహుమతి అందిస్తున్న ఉపాధ్యాయులు


Advertisement
Advertisement