న్యూఢిల్లీ: కరోనా కాటుకు భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు ఫిఫా వరల్డ్‌కప్-2023 ఆశలు గల్లంతయ్యాయి. జట్టులో 12 మంది ప్లేయర్లకు కొవిడ్ సోకడంతో.. ఆసియాక్‌పలో ఆదివారం చైనీస్ తైపీతో మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ఏకంగా టోర్నీ నుంచే టీమిండియా తప్పుకొన్నట్టు సోమవారం ప్రకటించారు. ఒకవేళ భారత్.. తైపీ మీద గెలిచి ఆసియాకప్ క్వార్టర్స్‌కు చేరుకొని ఉంటే వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించే అవకాశం ఉండేది. వరల్డ్‌కప్ కల భగ్నం కావడంతో క్రీడాకారిణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవకాశం కోసం ఏడాదిగా ఎన్నో కష్టాలకోర్చి సాధన చేశామని కెప్టెన్ ఆశాలత చెప్పింది.