ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు కఠిన డ్రా

ABN , First Publish Date - 2022-08-11T08:54:18+05:30 IST

ఈనెల 22 నుంచి 28 వరకు టోక్యోలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు కఠిన సవాల్‌ ఎదురవనుంది.

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు కఠిన డ్రా

న్యూఢిల్లీ: ఈనెల 22 నుంచి 28 వరకు టోక్యోలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు  కఠిన సవాల్‌ ఎదురవనుంది.  తొలిరౌండ్లో బై అందుకున్న సింధు.. రెండు, మూడు రౌండ్లలో చైనా షట్లర్లు హాన్‌ యూ, వాంగ్‌ జి యితో ఆడే అవకాశముంది. ఆ తర్వాత కొరియా అమ్మాయి అన్‌ సే యంగ్‌ను సింధు ఎదుర్కోవచ్చు. ఇప్పటిదాకా అన్‌ సేతో ఐదు మ్యాచ్‌లాడిన సింధు.. ఒక్క దాంట్లోనూ నెగ్గలేదు. చెంగ్‌ గాన్‌ (హాంకాంగ్‌)తో తొలి రౌండ్‌ ఆడనున్న సైనా నెహ్వాల్‌ తర్వాత రౌండ్లో ఆరోసీడ్‌ ఒకుహరతో తలపడొచ్చు. పురుషుల తొలిరౌండ్లో హాన్స్‌ క్రిస్టియాన్‌తో లక్ష్యసేన్‌, మొమొటాతో ప్రణయ్‌ ఆడనున్నారు. 

Updated Date - 2022-08-11T08:54:18+05:30 IST