భారత జీడీపీ వృద్ధి అంచనాలను 7.5 శాతానికి తగ్గించిన World Bank

ABN , First Publish Date - 2022-06-08T03:03:11+05:30 IST

ద్రవ్యోల్బణం పెరుగుతుండడం, సరఫరా గొలుసులో అంతరాయాలు, భౌగోళిక రాజకీయ ఆందోళనల నేపథ్యంలో

భారత జీడీపీ వృద్ధి అంచనాలను 7.5 శాతానికి తగ్గించిన World Bank

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం పెరుగుతుండడం, సరఫరా గొలుసులో అంతరాయాలు, భౌగోళిక రాజకీయ ఆందోళనల నేపథ్యంలో భారత జీడీపీ (GDP) వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంకు తగ్గించింది. వృద్ధి అంచనాను తగ్గించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం 2023లో భారత వృద్ధి రేటు 8 శాతంగా అంచనా వేసిన ప్రపంచబ్యాంకు ఇప్పుడు దానిని 7.5 శాతానికి తగ్గించింది. అంతకుముందు దీనిని 8.7 శాతంగా అంచనా వేసింది.


గత ఆర్థిక సంవత్సరం 2021- 22లో 8.7 శాతం వృద్ధి రేటుతో ప్రస్తుత సంవత్సరం వృద్ధి రేటును పోల్చి చూశారు. అయితే, ప్రపంచబ్యాంకు తాజా గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్ నివేదిక ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటు మందగించవచ్చని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, సరఫరా గొలుసులో అవాంతరాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటివి ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు.

Updated Date - 2022-06-08T03:03:11+05:30 IST