అధిక రక్తపోటుపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-05-18T05:42:18+05:30 IST

అధిక రక్తపోటు అనర్ధాలు, నియంత్రణలో ఉంచుకోవడంపై పాలకోడేరు పీహెచ్‌సీ వైద్యాధికారి రంగమనాయుడు వివరించారు.

అధిక రక్తపోటుపై అప్రమత్తంగా ఉండాలి
పాలకోడేరు పీహెచ్‌సీ వద్ద అవగాహన ర్యాలీ

పాలకోడేరు, మే 17: అధిక రక్తపోటు అనర్ధాలు, నియంత్రణలో ఉంచుకోవడంపై పాలకోడేరు పీహెచ్‌సీ వైద్యాధికారి రంగమనాయుడు వివరించారు. ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినం సందర్భంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌ డాక్టర్‌ సుజన, విస్సాకోడేరు, గొరనమూడి, వెల్‌నెస్‌ సెంటర్లలో రోగులకు  సలహాలను అందించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో ఎం.సత్యనారాయణ, హెల్త్‌ సూపర్‌వైజర్‌, హెచ్‌విలు, హెల్త్‌ అసిస్టెంట్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.


పాలకొల్లు రూరల్‌: అధిక రక్తపోటు నివారణపై లంకలకోడేరు పీహెచ్‌సీలో డాక్టర్‌ ఎ.ప్రతాప్‌కుమార్‌, డాక్టర్‌ జి.భవానీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్‌ ప్రతాప్‌ కుమార్‌ మాట్లాడుతూ అధిక రక్తపోటుకు మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు కారణమన్నారు. నియంత్రణపై సూచనలు ఇచ్చారు. ఎంపీహెచ్‌ఈవో గుడాల హరిబాబు, సిబ్బంది చేబోలు శ్రీనివాస్‌, ఎంఆర్‌కె.రాజు, పీవీ.స్వామి, ఎస్‌కె.అ మరేశ్వర రావు, జి.ఉదయ్‌చందర్‌, ఎల్‌టీ.ప్రసాద్‌, డి.ప్రసాద్‌నాయుడు, సీహెచ్‌ ప్రసా ద్‌, హెల్త్‌ అసిస్టెంట్లు, ఎఎన్‌ఎంలు, ఆశాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:42:18+05:30 IST