Abn logo
Aug 3 2021 @ 23:46PM

స్కూల్స్‌ మ్యాపింగ్‌పై సదస్సు

సదస్సులో పాల్గొన్న కాకినాడ ఆర్జేడీ

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 3: నూతన జాతీయ విద్యా విధానం–2020పై సమ గ్ర విశ్లేషణ సదస్సు మంగళ వారం ఏలూరు సీఆర్‌ఆర్‌ అటానమస్‌ కళాశాలలో ప్రాథ మిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యా యులకు నిర్వహించారు. పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు (కాకినాడ ఆర్జేడీ) ఆర్‌. నరసింహారావు మాట్లాడుతూ మొత్తం ఆరు రకాల పాఠ శాలలు ఏర్పాటవుతాయన్నారు.  పూర్వ ప్రాథమిక విద్య (పీపీ–1, 2)తో శాటిలైట్‌ ఫౌండేషన్‌ పాఠశాలలు, పీపీ–1, 2, ఒకటి, రెండు తరగతులతో ఫౌండేషన్‌ పాఠశాలలు, పీపీ–1, 2లతోపాటు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలలు, పీపీ–1, 2, ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ప్రి హైస్కూల్స్‌, 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నత పాఠశాలలు, 3 నుంచి 12వ తరగతి వరకు హైస్కూల్‌ ప్లస్‌తో మొత్తం ఆరు రకాల పాఠశాలలుంటాయన్నారు. 250 మీటర్లలోపు ఉన్న 225 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను 193 ఉన్నత పాఠశాలల్లో మ్యాపింగ్‌ చేశామని, దీనివల్ల ఏ   పాఠశాల మూతపడదని,  ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టు తొలగించమన్నారు. విద్యా ర్థుల తల్లిదండ్రుల అభీష్టం మేరకు మాధ్యమాన్ని  ఎంచుకోవచ్చన్నారు.  డీఈవో  రేణుక, అసిస్టెంట్‌ డైరెక్టర్లు విజయ లక్ష్మి, వెంకట రమణ, ఎంఈఓ లు, డీవైఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.