Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంట్లోనే.. సులువుగా...

ఆంధ్రజ్యోతి(15-04-2020)

శరీరాన్ని చువ్వలా వంచగలిగేంతగా వ్యాయామం చేయాలంటే జిమ్‌కు వెళ్లి కష్టపడక్కర్లేదు. ఇంట్లోనే... అదీ మీ గదిలోనే సులువుగా కానిచ్చేయవచ్చు. 


వందకు  తగ్గద్దు..: చాపపై వెల్లకిలా పడుకోండి. కాళ్లు వంచకుండా నిదానంగా పైకి లేపండి. అలాగే భుజాలు, తల కూడా! ఇప్పుడు చేతులు పైకి చాచి, ఎడంగా పెట్టండి. ఇప్పుడు చాపకు ఆనకుండా చేతులను నెమ్మదిగా పైకీ, కిందకీ అంటూ ఉండండి. అలా 100 లెక్కపెట్టేవరకు మీ తల, భుజాలు, కాళ్లు ముందు చెప్పిన పొజిషన్‌లోనే ఉండాలి. దీనివల్ల పొట్ట కండరాలు బలపడతాయి. 


బంతిలా దొర్లుతూ..: కాళ్లు చాచి కూర్చోండి. ఇప్పుడు నిదానంగా కాళ్లు మడుస్తూ... మోకాళ్లను చేతులతో బంధించండి. వెన్నెముక ఇంగ్లిష్‌ అక్షరం ‘సీ’లా ఉండాలి. అదే పొజిషన్‌లో నెమ్మదిగా వెనక్కి దొర్లుతూ... తొడలు మీ ఛాతీకి ఆనేవరకు ప్రయత్నించండి. భుజాలు, తల చాపకు ఆనకూడదు. ఊపిరి తీసుకొని, అదే విధంగా ముందుకు దొర్లుతూ, మునుపటి పొజిషన్‌కు రండి. శ్వాస వదలండి. 


డబుల్‌ కిక్‌..: బొక్కబోర్లా పడుకొని, కుడి చెంపను చాపకు ఆనించండి. చేతులను వెనక నుంచి చాచి, నడుము కింద భాగంపై పెట్టండి. తరువాత కాళ్లను వంచకుండా కిక్‌ చేసినట్టు పైకి లేపండి. అలా రెండు మూడు కిక్‌ల తరువాత, వెనక్కు చాచిన చేతులను కాళ్లవైపునకు స్ర్టెచ్‌ చేస్తూ, అరచేతులు కలపండి. మోచేతులు దూరంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా తలను పైకి ఎత్తండి. మొదటి పొజిషన్‌కు వచ్చేయండి. ఈసారి ఎడమ చెంపను చాపకు ఆనించి, ఇదే విధంగా ప్రయత్నిస్తూ... ఐదుసార్లు చేయండి. 

Advertisement
Advertisement