గౌడకులస్తుల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-08-19T04:16:07+05:30 IST

జిల్లాలోని గౌడ కులస్తుల అభివృద్ధికి కృషిచేస్తామని ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లో సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతని అధికారి కంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

గౌడకులస్తుల అభివృద్ధికి కృషి
సర్వాయి పాపన్నగౌడ్‌ చిత్రానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే ఆత్రంసక్కు, అదనపుకలెక్టర్‌ రాజేశం

- ఎమ్మెల్యే ఆత్రం సక్కు 

ఆసిఫాబాద్‌, ఆగస్టు 18: జిల్లాలోని గౌడ కులస్తుల అభివృద్ధికి కృషిచేస్తామని ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లో సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతని అధికారి కంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సర్వాయి పాపన్నగౌడ్‌ జీవితచరిత్ర, ఆయన సేవలను, అభివృద్ధి పనుల గురించి వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ రాజేశం మాట్లాడుతూ గౌడ కులస్తులకు సంఘ భవననిర్మాణానికి కృషి చేస్తామ న్నారు. జడ్పీటీసీ అరిగెల నాఏశ్వర్‌రావు, ఎంపీపీ మల్లి కార్జున్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జ్యోతికిరణ్‌, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T04:16:07+05:30 IST