కూలి వద్దు... ప్రాణాలే ముద్దు

ABN , First Publish Date - 2020-04-10T06:13:36+05:30 IST

కూలి పనులు వద్దు..ప్రాణాలే ముద్దు అని పలు గ్రామాల వారు తీర్మానించారు.

కూలి వద్దు... ప్రాణాలే ముద్దు

పనులకు రామని  తేల్చిచెప్పిన కూలీలు


వేటపాలెం, ఏప్రిల్‌ 9 : కూలి పనులు వద్దు..ప్రాణాలే ముద్దు అని పలు గ్రామాల వారు తీర్మానించారు. మండల పరిధిలో ఉన్న సీఫుడ్‌ ఫ్యాక్టరీల్లో పనులు చేసే కూలీలు ఈ నెల 15వ తేదీ వరకు కూలి పనులకు రాబోమని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అధికారులకు తేల్చిచెప్పారు. కఠారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలేలకు చెందిన సీఫుడ్‌ ఫ్యాక్టరీల్లో పనిచేసే కూలీలతో గురువారం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు.


ఏవో కాశీవిశ్వనాథ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కూలి పనులకు వెసులుబాటు కల్పించిందని, కూలీల కొరతతో సీఫుడ్స్‌ ఎగుమతి నిలిచిపోయిందని, పనికివస్తే అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై ఆయా గ్రామాల వారు మాట్లాడుతూ గ్రామపెద్దల నిర్ణయం, కట్టుబాటు ప్రకారం ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తేసే వరకూ కూలికి వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు తహసీల్దార్‌ కేఎల్‌ మహేశ్వరరావు, ఎంపీడీవో నేతాజీ, ఎఫ్‌డీవో పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-10T06:13:36+05:30 IST