నిరసనల హోరుతో దద్దరిల్లిన ఆర్డీవో కార్యాలయం

ABN , First Publish Date - 2021-07-27T04:41:01+05:30 IST

సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.

నిరసనల హోరుతో దద్దరిల్లిన ఆర్డీవో కార్యాలయం
జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద వర్కర్స్‌ నిరసన

జంగారెడ్డిగూడెం, జూలై 26 : సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. నిరసన, నినాదాలతో ఆ ప్రాం తం హోరెత్తింది. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందించారు.


ధాన్యం, మొక్కజొన్న సొమ్ము ఇవ్వండి


రైతులకు మొక్కజొన్న, ధాన్యం సొమ్ము రెండు నెలలుగా ప్రభుత్వం  చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అప్పు చేసి పంట పండించిన రైతులకు వడ్డీ భారంగా మారిందన్నా రు. వెంటనే సొమ్ము చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గోపాలకృష్ణ, కె.గంగ ప్రసాద్‌, కె.నాగేశ్వరరావు, పీవీవీ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


రజకులకు రక్షణ చట్టం అమలు చేయాలి


రజకులకు రక్షణ చట్టం అమలు చేయాలని రజక సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. రజకులపై దాడులు చేస్తున్నారని, రక్షణకు ప్రత్యేక చట్టా లను అమలు చేయాలని జిల్లా అధ్యక్షుడు చాటపర్తి పోసిబాబు డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపల్లి రవి, లింగాల సత్యనారాయణ, సంపంగి నాని, లింగాల రాంబాబు, మెట్ట సత్యనారాయణ, కానూరి రాము, సూర్యచంద్రరావు, రాచకొండ రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


పోలీసు జరిమానాలపై నిరసన


కొవిడ్‌ నిబంధనల పేరుతో విధుల్లో ఉన్న కార్మికులు, ఉద్యోగుల బైక్‌లకు పోలీసులు జరిమానా విధించడంపై సీఐటీయూ నిరసన వ్యక్తం చేసింది. సీఐటీయూ మండల కార్యదర్శి ఎస్‌కే సుభాషిణి మాట్లాడుతూ కొవిడ్‌ వంటి విషమ పరిస్థితుల్లో చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ వర్కర్లు, ఉద్యోగులకు జరిమానా వేయడాన్ని తప్పుబట్టారు.

Updated Date - 2021-07-27T04:41:01+05:30 IST