కార్మికులు సభ్యత్వ నమోదు చేయించుకోండి

ABN , First Publish Date - 2022-01-21T04:50:54+05:30 IST

అసంఘటిత రంగ కార్మికుల సభ్యత్వ నమోదు పథకాన్ని కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని గోపవరం పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

కార్మికులు సభ్యత్వ నమోదు చేయించుకోండి
శ్రీనివాసపురంలో కార్మికులకు సభ్యత్వ నమోదు చేస్తున్న దృశ్యం

గోపవరం, జనవరి 20 : అసంఘటిత రంగ కార్మికుల సభ్యత్వ నమోదు  పథకాన్ని కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని గోపవరం పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని శ్రీనివాసపురంలో కార్మికుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో వలస  కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల అవస్థలు, ఇబ్బందులను దృష్టిలోపెట్టుకొని ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. భవన నిర్మాణ రంగంలోని కార్మికులు, వలస కార్మికులు, రైతు వ్యవసాయ కూలీలు, సామాన్య వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు  ప్రతి ఒక్కరూ దీనికి అర్హులేనన్నారు. ఈ పథకం వల్ల ప్రమాదవశాత్తూ మరణించిన వారికి వారి నామినీకి రూ.2లక్షలు, అంగవైకల్యం కలిగిన వారికి రూ.1లక్ష ఆర్థి క సాయం అందుతుందన్నారు. వెంటనే గుర్తింపు కార్డు కావాలనుకునేవారు. రూ.50 చెల్లించి కార్డు పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, శశికళ, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T04:50:54+05:30 IST