ట్రక్కులు, కార్మికులే పెద్ద సవాలు

ABN , First Publish Date - 2020-03-31T06:51:19+05:30 IST

దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో కార్మికుల లభ్యతతో పాటుగా వస్తు రవాణాకు ట్రక్కులు లేకపోవడం పెద్ద సవాలుగా ఉన్నదని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు...

ట్రక్కులు, కార్మికులే పెద్ద సవాలు

  • ఎఫ్‌ఎంసీజీ కంపెనీల వివరణ


న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో కార్మికుల లభ్యతతో పాటుగా వస్తు రవాణాకు  ట్రక్కులు లేకపోవడం పెద్ద సవాలుగా ఉన్నదని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఐటీసీ, డాబర్‌ ఇండియా, పార్లే వివరించాయి. ఇటీవల ప్రభుత్వం తయారీ ప్లాంట్లు పని చేయడానికి, వస్తు రవాణా వాహనాలు తిరగడానికి అనుమతి ఇచ్చినందు వల్ల ఆ కష్టాలు కొంతవరకు తగ్గాయంటూ అన్ని రకాల నిత్యావసరాల సరఫరాలు క్రమంగా మెరుగురుస్తామని హామీ ఇచ్చాయు.


ఇంతవరకు ప్రధాన అవరోధంగా ఉన్న ఆ రెండు సమస్యలు తీరడంతో సరఫరాల వ్యవస్థ క్రమంగా పనిచేయడం ప్రారంభమవుతుందని వారు పేర్కొన్నారు. అయితే చాలా మంది కార్మికులు స్వస్థలాలకు తరలిపోవడం వల్ల ఫ్యాక్టరీలు పని చేయడానికి అవసరమైన కార్మికుల లభ్యత పెద్ద  సమస్యగానే ఉన్నదని డాబర్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ షారుఖ్‌ ఖాన్‌, పార్లే ప్రాడక్ట్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ మయాంక్‌ షా అన్నారు. అంతర్‌ రాష్ట్ర వాహనాల రవాణాకు గల ఆంక్షలు కూడా అతి పెద్ద సవాలని ఐటీసీ ప్రతినిధి చెప్పారు. 


Updated Date - 2020-03-31T06:51:19+05:30 IST