పని చేసినా పైసలేవీ?

ABN , First Publish Date - 2022-05-08T04:41:42+05:30 IST

పనులు చేసే చోట సదుపాయాలు దేవుడెరుగు.. ఉపాధి కూలీలకు వేతనాలు కూడా అంద డం లేదు.

పని చేసినా పైసలేవీ?
ఆలూరులో పనులు చేస్తున్న ఉపాధి కూలీలు

  1. ఉమ్మడి జిల్లాలో రూ.30 కోట్లు పెండింగ్‌
  2.  ఉపాధి కూలీలకు అందని వేతనాలు
  3.  నిలిచిపోయిన సౌకర్యాలు
  4.  వేసవి అలవెన్స ఊసేలేదు

ఆలూరు, మే 7: పనులు చేసే చోట సదుపాయాలు దేవుడెరుగు.. ఉపాధి కూలీలకు వేతనాలు కూడా అంద డం లేదు. ఉమ్మడి జిల్లాలో రూ.30 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉపాధి హామీ చట్టం ప్రకారం 14 రోజుల్లో చేసిన పనులకు కూలి చెల్లించాల్సి ఉంది. 40 రోజులు గడిచినా కూలి డబ్బులు అందలేదు. దీంతో దాదాపుగా 2 లక్షల మంది కూలీలు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఫ వేసవి అలవెన్సకు మంగళం.. ప్రతి ఏటా వేసవిలో ఉపాధి కూలీలకు గతంలో 30 శాతం మేర అలవెన్స చెల్లించే వారు. అది కూడా రావడం లేదు. అలాగే ఎండ లు మండుతుండడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. పని ప్రదేశంలో సేదదీరేందుకు టెంట్లు కూడా ఏర్పాటు చేయలేదు. పని ప్రదేశంలో ఫస్ట్‌ఎయిడ్‌ కిట్లు కూడా సరఫరా నిలిచిపోయింది. 

  కూలి డబ్బులు ఎప్పుడు ఇస్తారో..

నెల గడిచినా చేసిన పనులకు కూలి డబ్బులు ఇవ్వడం లేదు. సార్‌ వాళ్లను అడిగితే వస్తాయి అంటున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఎలా కుటుంబాలను పోషించు కోవాలి. మండే ఎండలకు పనులు చేస్తున్నాం. కనీస సౌకర్యాలు లేవు.

-చాకలి మంగయ్య, ఉపాధి కూలీ, ఆలూరు

  ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది

ఉపాధి కూలీలకు వేతనాలు పెంగింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. అయితే కేంద్రం నుంచి బడ్జెట్‌ ఇంకా కేటా యించలేదు. వచ్చిన వెంటనే వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఎండలు అధికంగా ఉండడంతో ఉదయం 6 నుంచి 11 వరకు మాత్రమే పనులు చేయాలని చెబుతున్నాం. 

-అమర్‌నాథ్‌, డ్వామా పీడీ

Read more