స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో పనిచేయాలి

ABN , First Publish Date - 2022-08-12T06:41:41+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో పనిచేయాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి ఏ.నర్సింహమూర్తి, జూనియర్‌ జడ్జి సంకేత్‌మిత్ర, ఆర్డీవో వెంకారెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చన కోరారు.

స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో పనిచేయాలి
కోదాడలో ఫ్రీడం రన్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం ఫ్రీడం రన్‌ను నిర్వహించారు. పోలీసులు, అధికారులు, విద్యార్థులు, యువత జాతీయ జెండాలు చేబూని ఫ్రీడం రన్‌లో  ఉత్సాహంగా పాల్గొన్నారు. 

- ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌

- స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో పనిచేయాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి ఏ.నర్సింహమూర్తి, జూనియర్‌ జడ్జి సంకేత్‌మిత్ర, ఆర్డీవో వెంకారెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చన కోరారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా హుజూర్‌నగర్‌లోని  ఇందిరా సెంటర్‌ నుంచి గాంధీ పార్కు వరకు రన్‌ నిర్వహించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌, గెల్లి రవి, అమర్‌నాథ్‌రెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

 - ప్రభుత్వం నిర్వహిస్తున్న జెండా పండుగతో ప్రతీ ఒక్కరిలో జాతీయభావం పెంపొందుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. మునిసిపాలిటీ సిబ్బంది,  పోలీసుల ఆధ్వర్యంలో కోదాడలోని  ఖమ్మం క్రాస్‌ రోడ్డు నుంచి రంగా థియేటర్‌ వరకు నిర్వహించిన ఫ్రీడం రన్‌లో చిలుకూరులో నిర్వ హించిన ఫ్రీడం రన్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీవో కిషోర్‌కుమార్‌, డీఎస్పీ  వెంకటేశ్వర్‌రెడ్డి,పాల్గొన్నారు. 

-  సూర్యాపేటలో ఫ్రీడం రన్‌ను రాజ్యసభ సభ్యుడు   లింగయ్యయాదవ్‌, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌  ప్రారంభించారు.ఎఫ్‌వో ముకుందరెడ్డి మూర్చతో పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు.

- కోదాడలోని థియేటర్లలో గాంధీ చిత్రాన్ని విద్యార్థులతో కలిసి  మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషలక్ష్మీనారాయణ వీక్షించారు. కార్యక్రమంలో  డీసీఎంఎస్‌ చైర్మన్‌  వట్టే జానయ్యయాదవ్‌ పాల్గొన్నారు.

- సూర్యాపేట రూరల్‌ ఎస్‌ఐ ఆర్‌.సాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం రన్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.

- స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని అనంతగిరి. గరిడేపల్లి,  తిరుమలగిరి, మఠంపల్లి, నేరే డుచర్ల, మద్దిరాల, నూతనకల్‌ మండలాల్లో ఫ్రీడం రన్‌ను నిర్వహించారు. కార్యక్రమాల్లో పోలీసు సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

- నడిగూడెంలో  సాయి ప్లబిక్‌ స్కూల్‌ విద్యార్థులు ఎఫ్‌75 ఆకారంలో ప్రదర్శన చేశారు. మోతె  మండలం కూడలి ప్రాథమిక పాఠశాల్లో విద్యార్థులు 75 సంఖ్య ఆకారంలో మానవహారంగా కూర్చొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పొనుగోటి నర్సింహారావు, పాల్గొన్నారు. 

- నడిగూడెం పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం రన్‌లో జడ్పీటీసీ బానాల కవితనాగరాజు, మండల సర్పంచుల ఫోరం అఽధ్యక్షుడు దేవబత్తిని వెంకటనర్సయ్య, ఎస్‌ఐ ఏడుకొండలు, ఎంపీడీవో ఎర్రయ్య, తహసీల్దార్‌ పి.నాగేశ్వరావు, వై.వీరస్వామి పాల్గొన్నారు

- చివ్వెంల, మేళ్లచెర్వు, హుజూర్‌నగర్‌, తుంగతుర్తి,  చింతలపాలెం. పెన్‌పహాడ్‌, కోదాడ, మునగాలలో కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, రూరల్‌ సీఐ ప్రసాద్‌, తహసీల్దార్‌ రాజేశ్వరి, ఎంపీడీవో ఈదయ్య, ఎస్‌ఐ చల్లా శ్రీనివాస్‌, సర్పంచ్‌ కొడారు బాబు, సొసైటీ చైర్మన్‌ జనార్దన్‌, అధికారులు పాల్గొన్నారు. 








Updated Date - 2022-08-12T06:41:41+05:30 IST