సమన్వయంతో పనిచేయండి

ABN , First Publish Date - 2021-03-05T05:44:25+05:30 IST

కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయా లని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ అనుపమాంజలి చెప్పారు.

సమన్వయంతో పనిచేయండి
సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ అనుపమాంజలి

  • నరసన్న ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
  • సమన్వయ కమిటీ సమావేశంలో సబ్‌కలెక్టర్‌ అనుపమ అంజలి 

కోరుకొండ మార్చి 4: కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలను  ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయా లని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ అనుపమాంజలి చెప్పారు. స్వామి వారి కల్యాణోత్సవాలు ఈనెల 23నుంచి 29వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సబ్‌కలెక్టర్‌ గురువారం మధ్యాహ్నం కోరుకొండలోని స్వామివారి సన్నిధిలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వ హించారు. కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించేదుకు తీసుకోవాల్సిన చర్యలపై శాఖల వారీగా సమీక్షించారు. కొండపైనా దిగువునా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకోవాలన్నా రు. మంచినీరు సరఫరా, పారిశుధ్య నిర్వహణ, లైన్ల ఏర్పాటు, దేవుని కోనేరు, కొండ వద్ద తాత్కలిక మరుగుదొడ్లు ఏర్పాటుపై తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, దేవదాయశాఖ అధికారులకు సూచించారు. రథోత్సవం, కల్యాణోత్సవం సందర్భంగా ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని, మహిళా పోలీసులు పెద్ద ఎత్తున విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. భక్తుల భద్రత దృష్ట్యా రోప్‌ పార్టీలను ఏర్పాటు చేయాలన్నారు. చెరుకు లారీలు, భారీ వాహనాలు స్వామివారి కొండ వైపు రాకుండా ట్రాఫిక్‌ ను దారి మళ్లించాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. మూడు షిప్టుల విధానంలో పారిశుధ్య పనులు చేయించాలని గ్రామ పంచాయతీ అధికారు లకు సూచించారు. దేవస్ధానానికి 500 మీటర్ల పరిధి వరకు చుట్టు పక్కల  ఎలాంటి మద్యం, మాంసం విక్రయాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రథోత్సం సందర్భంగా టెలికాం, విద్యుతశాఖలు వైర్లను తాత్కా లికంగా తొలగించాలని సబ్‌కలెక్టర్‌ సూచించారు. దేవస్థానానికి దగ్గరలో కూల్‌డ్రింక్‌ తదితర షాపుల నిర్వహణకు అనుమతి లేదని చెప్పారు. అలాగే ఆర్టీసీ, ఎక్సైజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖలకు పలు సూచనలు చేశారు. కరోనా జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో దేవస్థానం అనువంశిక ధర్మకర్త పరా సర రంగరాజ బట్టర్‌, అన్నవరం దేవస్థానం ఈవో త్రినాథరావు, డీఎల్‌ పీవో ఎ.సత్యనారాయణ, డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచవో డాక్టర్‌ కోమలి, తహశీల్దార్‌ పాపారావు, ఎంపీడీవో నరేష్‌కుమార్‌, దేవదాయ శాఖ సూపరింటెండెంట్‌ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-05T05:44:25+05:30 IST