పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయండి

ABN , First Publish Date - 2022-08-20T05:05:10+05:30 IST

జిల్లాలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయండి
ఉజ్వల యోజన పథకంలో మంజూరైన గ్యాస్‌ కనెక్షన్‌లను అందిస్తున్న జిల్లా అద్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

 బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 19: జిల్లాలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్‌ 33వ డివిజన్‌లోని బూత్‌ ఇన్‌చార్జీలను, శక్తి కేంద్రాల ఇన్‌చార్జీలను వారి ఇంటికి వెళ్లి కలిసి క్షేమ సమాచారాలు, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్‌ దుబాల శ్రీనివాస్‌, కరీంనగర్‌ సెంట్రల్‌ జోన్‌ అధ్యక్షుడు దురిశెట్టి అనూప్‌కుమార్‌, కార్పొరేషన్‌ ఐదు డివిజన్ల ప్రభారి దేవిశెట్టి నవీన్‌, ఉపాధ్యక్షుడు అజయ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి తనుకు సాయికృష్ణ, యువమోర్చా ఉపాధ్యక్షుడు మ్యాడరం అభినయ్‌చారి పాల్గొన్నారు. 


  పేద మహిళలకు వరం ఉజ్వల యోజన పథకం


కరీంనగర్‌ రూరల్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన పథకం గ్రామీణ పేద మహిళలకు వరమని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో ఉజ్వల యోజన పథకం కింద మంజూరైన గ్యాస్‌ కనెక్షన్‌లను మహిళలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల వంటింటి కష్టాలు తీర్చేందుకు నరేంద్ర మోడి ఉజ్వల యోజన పథకాన్ని తీసుకు వచ్చారన్నారు. దేశంలోని అర్హులైన కోట్లాది మంది మహిళలకు గ్యాస్‌ కనెక్షన్‌లు అందిస్తున్నారన్నారు. ఈ పథకాన్ని పేద మహిళలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కడార్ల రతన్‌కుమార్‌, మండల ప్రధాన కార్యదర్శి వేముల అనిల్‌కుమార్‌, జవ్వాజి రమేష్‌, జిట్టవేణి రుణు, కుంట తిరుపతి, కరుణాకర్‌, దాసరి రవి, మేరుగు మల్లేశం, సురేష్‌, ప్రశాంత్‌, శ్రావణ్‌, రాజేష్‌, రాజు, వసుందర భారత్‌ గ్యాస్‌ ఏజెన్సి నిర్వాహకులు ఎడ్ల శ్రీనివాస్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T05:05:10+05:30 IST