సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-08-19T04:38:08+05:30 IST

గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే గడపగ డ పకు కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నట్లు మంత్రి ఆది మూ ల పు సురేష్‌ అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి
సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి

మంత్రి సురేష్‌

పెద్దారవీడు(మార్కాపురం), ఆగస్టు 18: గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే గడపగ డ పకు కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నట్లు మంత్రి ఆది మూ ల పు సురేష్‌ అన్నారు. మండలంలోని తోకపల్లిలో గురువారం రెండవ రో జు గడపగడపకు వెళ్లారు. ప్రజలకు బ్రోచర్లను పంపిణీ చశారు. కార్యక్ర మంలో డీఎల్‌డీవో సాయికుమార్‌, తహసీల్దార్‌ విడుదల కిరణ్‌కుమార్‌, డీటీ కృష్ణారెడ్డి, ఎంపీడీవో నరసింహులు డీఈ రామకృష్ణ, ఎంఈవో మ స్తాన్‌నాయక్‌, వ్యవసాయాధికారి బుజ్జి బాయ్‌, ఉద్యాన అధికారి ఆదిరెడ్డి, ఏఈ రమేష్‌, మండల కన్వీనర్‌ పాలిరెడ్డి కృష్ణా రెడ్డి, ఎంపీపీ బెజవాడ పెద్దగురవయ్య, జడ్పీటీసీ స భ్యుడు  చలమారెడ్డి పా ల్గొన్నారు. 

నియోజవర్గాన్ని అభివృద్ధి చేస్తా

ఎర్రగొండపాలెం :  ఎర్రగొండపాలెం నియోజకవర్గ  అభివృద్ధే ధ్యే యమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఎర్రగొండపాలెం గ్రామపంచాయతీలో రూ.1.30 కోటి నిధులతో నిర్మించిన వైఎస్‌ఆర్‌ వాణిజ్య కాంప్లెక్స్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ప్రయాణికుల సౌక ర్యం కోసం బస్టాండ్‌ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. టీటీడీ ని ధులు రూ.2కోట్లతో కల్యాణ మండపం నిర్మాణంలో ఉందని, రూ.23.25 కో ట్ల నాబార్డు నిధులతో 100 పడకల వైద్యశాల భవనం పనులు జరుగుతున్నాయని అన్నారు. రాళ్లవాగుపరీవాహక ప్రాంతంలో ప్రజల సౌకర్యం కోసం పార్కులను నిర్మించాలని ఆయన అధికారులకు సూచించారు. తీగతీరు కాలువనుంచి పుల్లలచెరువు మండలంలో 20 గ్రామాలకు సాగు, తాగు నీరు అందించే అనుసంధాన ప్రక్రి య పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మ న్‌ ఒంగోలు మూర్తిరెడ్డి, తహసీల్దారు కె.దాస్‌, ఎంపీడీవో సాయికుమార్‌, ఎంపీపీ కిరణ్‌గౌడ్‌, జడ్పీటీసీ సభ్యుడు విజయబాస్కర్‌, పీడీసీబీ డైరెక్టర్‌ ఎం బాలగురవయ్య, కార్యదర్శి రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు. 

ఏఎంసీ చైర్మన్‌గా ఉడుముల నియామకం

ఎర్రగొండపాలెం ఏఎంసీ చైర్మన్‌గా పుల్లలచెరువు మండల వైసీపీ కన్వీనర్‌ ఉడుముల శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ వ్యవసాయశాఖ కమి షనర్‌ కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు అందాయి.  పెద్దారవీడు మండలం తోకపల్లి  గ్రామంలో పర్య టిస్తున్న మంత్రి సురేష్‌ ని యామక పత్రాన్ని ఉడుములకు అందజేశారు. 

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం

ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

మార్కాపురం, జూన్‌ 3:  సం క్షేమం, అభివృద్ధికి సమ ప్రా ధాన్యత  ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కుందురు నాగా ర్జునరెడ్డి అన్నారు. మండలంలోని రాయవరంలో గురువారం గడప గ డపకు కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఎమ్మెలే ఇంటింటికీ వెళ్లి  నవ రత్నాలపై అవగాహన కల్పించారు. ఎంపీపీ పోరెడ్డి అ రుణ చెంచిరెడ్డి, జడ్పీటీసీ బాపనరెడ్డి, ఎంపీటీసీ మల్లారెడ్డి, ఎంపీడీవో న రసింహులు, ఏపీఎం రమేష్‌బాబు, పీఆర్‌ ఏఈ మోహన్‌రాజు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-19T04:38:08+05:30 IST