ఒంటి కాలితో చేసే వ్యాయామం వల్ల..

ABN , First Publish Date - 2020-05-20T21:25:51+05:30 IST

వర్కవుట్‌ ఏదైనా సరే... హైరానా పడిపోవద్దు. నిదానంగా, ఒక పద్ధతి ప్రకారం చేసుకొంటూ

ఒంటి కాలితో చేసే వ్యాయామం వల్ల..

ఆంధ్రజ్యోతి(20-05-2020):

ఒంటి కాలితో...

వర్కవుట్‌ ఏదైనా సరే... హైరానా పడిపోవద్దు. నిదానంగా, ఒక పద్ధతి ప్రకారం చేసుకొంటూ వెళ్లాలి. అన్నింటి కన్నా బ్యాలెన్స్‌ కీలకం. ఒంటి కాలితో చేసే వ్యాయామం  నడుము కింది భాగాన్ని దృఢంగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరూ ప్రయత్నించండి. కానీ... ముందే చెప్పినట్టు దీనికి బ్యాలెన్స్‌ ముఖ్యం. 


స్క్వాట్‌: నిటారుగా నిలుచోండి. ఈ చిత్రంలో చూపినట్టు కుడి కాలిని వంచకుండా కొద్దిగా పైకి లేపండి. శరీరం బరువునంతా ఎడమ కాలిపై ఉండాలి. బ్యాలెన్స్‌ కోసం చేతులు ముందుకు చాచండి. ఇప్పుడు ఎడమ కాలిని వంచండి. తొడలు దాదాపు నేలకు సమాంతరంగా వచ్చే వరకు ప్రయత్నించండి. మళ్లీ మొదటి పొజిషన్‌కు వచ్చేయండి. ఇదే విధంగా 5 నుంచి 10 సార్లు చేయండి.


బాక్స్‌ జంప్‌: దాదాపు అడుగు ఎత్తున్న స్టూలు ముందు నిల్చోండి. ఎడమ కాలిని మడిచి, కొద్దిగా కుడి కాలి వెనక్కు తీసుకువెళ్లండి. ఇప్పుడు చేతులను ఊపుతో, ఒంటి కాలితో స్టూలుపైకి దూకండి. అలా 5 నుంచి 10సార్లు చేయండి. తరువాత ఇలాగే ఎడమ కాలితో ప్రయత్నించండి. 


కాఫ్‌ రైజ్‌: కొద్దిగా ముందుకు వంగి, అరచేతులు గోడకు ఆనించి నిలబడండి. ఎడమ పాదం నేలకు తగలకుండా, కుడి పాదం వెనకాల పెట్టండి. ఇప్పుడు కుడి కాలి మునివేళ్లపై సాధ్యమైనంత పైకి లేచి, శరీర బరువునంతా దానిపై బ్యాలెన్స్‌ చేయండి. మీ కాలి పిక్క బిగుసుకున్నట్టు అనిపిస్తుంది. దీర్ఘ శ్వాస తీసుకొని, మొదటి పొజిషన్‌కు వచ్చేయండి. సాధ్యమైనన్ని సార్లు కాళ్లు మార్చుతూ ఇలా చేయండి.


Updated Date - 2020-05-20T21:25:51+05:30 IST