Advertisement
Advertisement
Abn logo
Advertisement

హ్యామ్‌స్ర్టింగ్స్‌కు వ్యాయామం

ఆంధ్రజ్యోతి(07-05-2020):

హ్యామ్‌స్ర్టింగ్స్‌కు సంబంధించిన వ్యాయామం చేయడం ద్వారా మీ తొడ కండరాలను బలంగా మార్చుకోవచ్చు. వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. 


క్రాస్‌డ్‌ లెగ్స్‌: నిటారుగా నిలబడి, కుడి పాదాన్ని ఎడమ పాదం మీదుగా అవతల పక్క పెట్టండి. అంటే ఎడమ పాదం కుడి వైపు, కుడి పాదం ఎడమ వైపునకు మారతాయనమాట. మోకాళ్లు వంగకూడదు. నుదుటిని మోకాళ్లకు ఆనించే ప్రయత్నం చేసి, అలా 15 నుంచి 30 సెకన్లు ఉండండి. తరువాత ఎడమ పాదాలు అటూ... ఇటూ మార్చి, ఇదే విధంగా చేయండి. కూర్చొని..: కుర్చీ అంచుపై కూర్చొని, చేతులు నడుముపై పెట్టండి. కుడి కాలిని పూర్తిగా సాగదీసి, మడమ నేలపై ఆనించి, మునివేళ్లు ఆకాశం వైపు చూసేలా ఉంచాలి. మెడ, నడుము పై భాగం బెండ్‌ చేయకూడదు. నాభి ప్రాంతాన్ని కుడి తొడ వైపు పుష్‌ చేయండి. ఇలా వేరే కాలితో కూడా చేయాలి.


టవల్‌తో స్ర్టెచ్‌: చాప మీద వెల్లకిలా పడుకోండి. ఇప్పుడు టవల్‌ను ఈ చిత్రంలో చూపినట్టు కుడి పాదానికి వేసి, రెండు చేతులతో కొనలు పట్టుకోండి. టవల్‌ సాయంతో కుడి కాలిని సాధ్యమైనంత వరకు మీ వైపునకు లాగి, 15 నుంచి 30 సెకన్లు ఉంచండి. మోకాలు వంచకూడదు. అలాగే రెండో కాలిని నేలపై పూర్తిగా ఆనించాలి. ఇదే విధంగా ఎడమ కాలితో చేయండి. Advertisement
Advertisement