Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేళ్లు బలంగా ఉండాలంటే...

ఆంధ్రజ్యోతి(23-04-2020)

అసలే ‘డెస్క్‌’ ఉద్యోగాలు... ఆపై ఎడతెరిపిలేని పని ఒత్తిడులు... ఇక వ్యాయామానికి తీరిక ఎక్కడుంటుందనుకొనేవారికి ఇప్పుడు కావల్సినంత సమయం. శరీరంపై నిజంగా శ్రద్ధ ఉండాలే కానీ... పెద్దగా సమయం, శ్రమ లేకుండానే ఫిట్‌గా ఉండవచ్చు. అలా పది నిమిషాల లోపే కానిచ్చేసే ఎక్స్‌ర్‌సైజ్‌ ఇది. దీనివల్ల చేతి వేళ్లు, మణికట్టు బలంగా తయారవుతాయి.


మణికట్టు: అరచేయి పైకి కనిపించేలా పెట్టి, కుడి చేతిని ముందుకు చాచండి. ఇప్పుడు అరచేతిని వెనక్కు వంచి, వేళ్లను మరో చేతి వేళ్లతో పట్టుకొని, నిదానంగా మీ వైపునకు లాగండి. బలప్రయోగం వద్దు. సాధ్యమైనంత వరకు వంచండి. ఐదు సెకన్లు అలాగే ఉంచుతూ, మూడుసార్లు ఇలా చేయండి. తరువాత రెండో చేతితో ఇదే విధంగా చేయాలి. 


వేళ్లకు: కుడి చేయి ముందుకు చాచి, అరచేయి నేలను చూస్తున్నట్టు పెట్టండి. బొటన వేలిని రెండో చేత్తో నెమ్మదిగా సాధ్యమైనంత సాగదీసి 25 సెకన్లపాటు ఉంచండి. ఇప్పుడు బొటనవేలిని అరచేతి వైపు పుష్‌ చేసి, 25 సెకన్లు ఆగండి. ఇలాగే అన్ని వేళ్లతో చేయండి. 


పంజాల్టా: చేతులు ముందుకు చాచి, అరచేతులు మిమ్మల్ని చూసేలా వంచండి. బొటనవేలు బయటకు ఉండాలి. ఇప్పుడు ప్రతి వేలి కొన... ఆ వేలి మొదళ్లను తాకేలా బెండ్‌ చేయండి. అలా 30 నుంచి 60 సెకన్లు ఉన్న తరువాత వేళ్లను వదిలేయండి. ఇలా నాలుగుసార్లు చేయండి.

Advertisement
Advertisement