పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-07-30T04:58:38+05:30 IST

ఉమ్మడి పాల మూరు జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను తక్షణ మే పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చే శారు.

పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌వెస్లీ

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌వెస్లీ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూలై29: ఉమ్మడి పాల మూరు జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను తక్షణ మే పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చే శారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కా ర్యాలయంలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన కేఎల్‌ఐ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కాక సాగునీరు కోసం రైతాంగం ఎదురుచూస్తున్నారని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోత ల పథకం కింద 2.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2004లో ప్రారంభించారని, అలాగే ఉమ్మడి జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 10లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటి వనరులు తీర్చేందుకు 2015లో ప్రారం భించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు నత్తనడక సాగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి జిల్లా పొడువున పారుతున్న కృష్ణాజలాల ను ఈ ప్రాంత రైతాంగం వాడుకునే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు. రాష్ట్ర ప్రభు త్వం తక్షణమే స్పందించి ప్రాజెక్టులకు సరిపడా నిధులు కేటాయించి పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు, నాయకులు పి.రామయ్య, శివవర్మ, అంతటి కాశన్న, అశోక్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.        

Updated Date - 2021-07-30T04:58:38+05:30 IST