ఆదివరాహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-08-10T05:30:00+05:30 IST

ఆదివరాహస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆదివరాహస్వామి ఆలయం మరింత అభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు.

ఆదివరాహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి
స్వామివారిని దర్శించుకుంటున్న ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు

- ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

కమాన్‌పూర్‌, ఆగస్టు 10: ఆదివరాహస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆదివరాహస్వామి ఆలయం మరింత అభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివరాహస్వామివారి జయంత్సుత్సవాల్లో భాగంగా బుధవారం ముగింపురోజు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కలకుంట్ల వరప్రసాదాచార్యులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రజలంతా స్వామివారి ఆశీస్సులతో పాడిపంటలు, పరిశ్రమలు అభివృద్ధి చెంది సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేగా ఆలయ అభివృద్ధికి   తనవంతుగా కృషిచేస్తానని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్‌ ఇనుగంటి ప్రేమతల, ఆలయ ఈవో కాంతారెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును  శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్‌, మండల అధ్యక్షుడు బుంపెల్లి రాజయ్య, ఎస్సీసెల్‌ మండల అధ్యక్షుడు మల్యాల తిరుపతి, ఎంపీటీపీ శవ్వశంకరయ్య, లల్లూ, పెండ్యాల రాజు, మల్యాల మహేష్‌ తదితరులు ఉన్నారు.

- ముగిసిన ఆదివరాహస్వామి జయంత్సుత్సవాలు

లక్ష్మీఆదివరాహస్వామి జయంత్సుత్సవాలు బుధవారం ముగిసాయి. చివరిరోజు సుప్రభాతం, ఆరాధన, గోపూజా,  అభిషేకంతో ఉత్సవాలు ముగిసాయి. ఈ ఉత్సవాలు చివరిరోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన మండలకేంద్రానికి చెందిన మాదాసు రవీందర్‌ను ఆలయ చైర్మన్‌, ఈవో, ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ ఇనుగంటి ప్రేమతల, ఆలయ ఈవో కాంతారెడ్డి, ప్రధానార్చకుడు కలకంట్ల వరప్రసాదాచార్యులు ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-08-10T05:30:00+05:30 IST