Abn logo
Jun 22 2021 @ 01:09AM

మౌలిక వసతుల కల్పనకు కృషి

రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎంపీ శ్రీనివాసులరెడ్డి

ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

పూరిమెట్ల(ముండ్లమూరు), జూన్‌ 21 : గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రధానంగా రహదారులను తారురోడ్లుగా మార్చి ప్రజలకు సౌకర్యాలు కల్పించటమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు. మండలంలోని పూరిమెట్ల నుంచి నూజెండ్లపల్లి వయా మారెళ్ల మీదుగా నిర్మించనున్న తారురోడ్డు నిర్మాణానికి సోమవారం వారు భూమి పూజ చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజనా కింద 9.7 కిలోమీటర్లకు గాను రూ.5.41 కోట్ల నిధులు మంజూర య్యాయి. పూరిమెట్లలో జరిగిన సభకు సర్పంచ్‌ ఒగురూరి రామాంజి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ మాట్లాడుతూ పూరిమెట్ల నుంచి వయా మారెళ్ల, నూజెళ్లపల్లి వరకు రహదారి మంజూరు చేయటంలో ఎంపీ పాత్ర ప్రముఖంగా ఉందన్నారు. ప్రధానంగా ఎత్తిపోతల పథకాన్ని పూరిమెట్ల గ్రామస్థులు అడిగారని, త్వరలోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచ్‌ రామాంజీ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యేలను సన్మానించారు. కార్యక్రమంలో ఈఈ మారుతీరావు, డీఈ శ్యాంప్రసాదు, ఏఈ నాసరరెడ్డి, మద్దిశెట్టి శ్రీధర్‌, మాగుంట రాఘవరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ఎడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, వైసీపీ సంయుక్త రాష్ట్ర కార్యదర్శి సుంకర బ్రహ్మానందరెడ్డి, సర్పంచ్‌లు చొప్పరపు వెంకటేశ్వర్లు, నలమోలు వెంకటేశ్వరరావు, అంబటి వెంకటేశ్వరరెడ్డి, బద్రి వెంకటసుబ్బారెడ్డి, ఎరబోలు చంద్రశేఖరరెడ్డి, ఒగురూరి హనుమయ్య, మొదుళ్ల వెంకట సుబ్బారెడ్డి, వేముల శ్రీనివాసరావు, కర్రపాటి శ్రీనివాసరావు, జమ్ముల గురవయ్య, నిడమానూరి చెంచయ్య, ముక్కమళ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 

కురిచేడు : గ్రామీణ రోడ్లకు మహర్దశ తీసుకొస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి చెప్పారు. కురిచేడు సాగర్‌ కాలువ వద్ద పడమరగంగవరం మీదుగా గంగదేవపల్లి వరకు తారు రోడ్డు నిర్మాణానికి సోమవారం ఎంపీతోపాటు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ శంకుస్థాపన చేశారు.  పీఎంజీవై నిధులు రూ.7.65 కోట్లతో తారురోడ్డు నిర్మిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఏర్పాటు, కురిచేడులో పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం, బాలయోగి గురుకులంలో 30 శాతం సీట్లు స్థానికులకు ఇవ్వాలని, సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహానికి స్థలం కేటాయించాలని వినతిపత్రాలు అందించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే బయ్యవరం గ్రామంలో తాగునీటి ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మేరువ పిచ్చిరెడ్డి, బెల్లం చంద్రశేఖర్‌, కానాల శివారెడ్డి, ఊట్ల వెంకటేశ్వర్లు, బుల్లం వెంకట నరసయ్య, క్రిష్టయ్య, ఇందూరి వెంకట నరిసిరెడ్డి, నుసుం నాగిరెడ్డి, పోతిరెడ్డి నాగిరెడ్డి, ఎనుగంటి గోపి, మేకల రాంబాబు పాల్గొన్నారు. 

దర్శిలో ఆనందయ్య మందు పంపిణీ

దర్శి : కరోనా నివారణకు ప్రజలకు ఆనందయ్య మందును ఎంపీ మాగుంట శ్రీనివాసరరెడ్డి పంపిణీ చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌తో కలిసి ప్రజలకు ఆనందయ్య మందును ఎంపీ పంపిణీ చేశారు. దర్శిలో తొలి విడతగా 3వేల మందికి ఈ మందును పంచారు. కార్యక్రమంలో మాగుంట తనయుడు రాఘవరెడ్డి,  నియోజకవర్గ వైసీపీ నాయకుడు మద్దిశెట్టి శ్రీధర్‌, ఏఎంసీ చైర్మన్‌ ఇడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ పాణ్యం హుస్సేన్‌, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కె.అంజిరెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రాంభూపాల్‌రెడ్డి, నాయకులు వై.వి.సుబ్బయ్య, ఎస్‌ తిరుపతిరెడ్డి, టి.చంద్రశేఖర్‌, వి.సి. రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.