Advertisement
Advertisement
Abn logo
Advertisement

గిరిజన ప్రాంతాల్లో అంకితభావంతో పనిచేయాలి

  • కలెక్టర్‌ సీహెచ్‌ హరికిరణ్‌
  • ఐటీడీఏ ప్రాంగణంలో పలు శాఖల పనితీరుపై సమీక్ష

చింతూరు, అక్టోబరు 24: ఆరోగ్య, ఐసీడీఎస్‌ సి బ్బంది గిరిజన ప్రాంతాల్లో అంకితభావంతో పనిచే యాలని కలెక్టర్‌ సీహెచ్‌ హరికిరణ్‌ చెప్పారు. ఆది వారం చింతూరులో పర్యటించారు. ఐటీడీఏ ప్రాంగ ణంలో వివిధ శాఖల పని తీరు, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి నెల ఆయా శాఖలు సమన్వయ సమా వేశాలు నిర్వహిం చుకుని ఉత్తమ పనితీరు ప్రదర్శించాలన్నారు. ఆర్‌బీ కే, హెల్త్‌ క్లినిక్‌, సచివాల య భవనాల నిర్మాణాలు 15 రోజుల్లో పూర్తి కావాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఉద్యోగులు తమకు ఏదైనా సమస్య ఎదురైనపుడు ఐటీడీపీ పీవోకు గానీ, తనకు గానీ నేరుగా తెలియచేసి ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు. అనంతరం ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక వైద్యశాలను కలెక్టర్‌ పరిశీలిం చారు. అక్కడ గర్భిణులతో ఆయన మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రాజ్యసభ సభ్యులు పరిమళ నద్వాని సీఎస్‌ఆర్‌ నిధులతో అందజేసిన ప్రత్యేక అంబులెన్సును ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ, ఏఎస్పీ కృష్ణకాంత్‌ వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement