Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆన్‌లైన్‌ గేమ్స్‌లో ‘వర్డ్‌లీ’ జోష్‌

కరోనా ఫలితంగా వీలయినంత వరకు ఇంట్లో ఉండటమే సురక్షితం అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే ఇంట్లో సమయాన్ని గడిపేవారిలో మొబైల్‌ గేమ్స్‌ ఆడేవారే ఎక్కువ.  ఈ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అలాంటి వాటిలో ‘వర్డ్‌లీ’ గేమ్‌ జోష్‌ ఎక్కువగా ఉంది.


అసలు సంగతికి వస్తే, ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ను కనుగొన్న వ్యక్తి ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఆయన పేరు జోష్‌ వర్డ్‌లీ.  ఆట కూడా ఆయన పేరిటే ఉనికిలోకి వచ్చింది. దీన్ని డౌన్‌లోడ్‌ చేయాల్సిన పనిలేదు. సెర్చ్‌ఇంజన్‌ సహాయంతో పేరు కొడితే చాలు ఆట ప్రత్యక్షమవుతుంది.    5్ఠ6తో గ్రిడ్‌ మొదట కనిపిస్తుంది. ర్యాండమ్‌గా ఏదో ఒక వర్డ్‌ టైప్‌ చేయడంతో ఆట మొదలవుతుంది. టాప్‌ వరసతో స్టార్ట్‌ అవుతుంది. అయిదు అక్షరాలతో కూడిన ఆరు పదాలకు అవకాశం ఉంటుంది. అయిదింటిని నింపిన తరవాత దానంతట అదే నిర్ధారితమవుతుంది అదే క్విజ్‌ ఆన్సర్‌. డివైస్‌లో ఈ గేమ్‌ని యాక్సెస్‌ చేసుకోవడం సులువు. ఒక గేమ్‌ తరవాత మరొకటి ఆడేందుకు గ్యాప్‌ ఉంటుంది. ఫలితంగా ఈ గేమ్‌ బాగా పాపులర్‌ అయింది.

Advertisement
Advertisement