కోవిడ్ నియంత్రణలోకి వచ్చిందని అనిపించేంత వరకూ పాఠశాలలు తెరవం : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-08-15T19:54:50+05:30 IST

కోవిడ్ పూర్తిగా అదుపులోకి వచ్చిందన్న నమ్మకం వస్తే గానీ... పాఠశాలలను తెరవమని

కోవిడ్ నియంత్రణలోకి వచ్చిందని అనిపించేంత వరకూ పాఠశాలలు తెరవం : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : కోవిడ్ పూర్తిగా అదుపులోకి వచ్చిందన్న నమ్మకం వస్తే గానీ... పాఠశాలలను తెరవమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం తమ ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమని తెలిపారు.

‘‘పాఠశాలలను ఇప్పుడే పునః ప్రారంభించకూడదని కొందరు మెసేజ్‌లు చేస్తున్నారు. పిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటామని వారికి నేను హామీ ఇస్తున్నా. కోవిడ్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని అనిపిస్తేనే పాఠశాలలు తెరుస్తాం. అప్పటి వరకూ ప్రారంభించం’’ అని స్పష్టం చేశారు. 

దేశ రాజధానిలో ప్రస్తుతం కోవిడ్ అదుపులోనే ఉందని ఆయన ప్రకటించారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ప్రసంగించారు. కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్న కరోనా యోధులకు, కేంద్రానికి కేజ్రీవాల్ ధన్యవాదాలు ప్రకటించారు. 


Updated Date - 2020-08-15T19:54:50+05:30 IST