నియంతనవుతా: MK Stalin

ABN , First Publish Date - 2022-07-05T00:28:46+05:30 IST

ప్రజాప్రతినిధులు అవినీతి, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడితే తాను నియంతలా మారి కఠిన చర్యలు తీసుకుంటానని..

నియంతనవుతా: MK Stalin

నమక్కల్: ప్రజాప్రతినిధులు అవినీతి, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడితే తాను నియంతలా (Dictator) మారి కఠిన చర్యలు తీసుకుంటానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) హెచ్చరించారు. నమక్కల్‌లో సోమవారంనాడు జరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. ప్రజాప్రతినిధులు చట్టం ప్రకారం నడుచుకోవాలని, ప్రజల కోసం పని చేయాలని, చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన అన్నారు.


''నేను పూర్తిగా ప్రజాస్వామ్యవాదిగా మారినట్టు నా సన్నిహిత మిత్రులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే... ఇతరుల అభిప్రాయాలు వినడం, వారి అభిప్రాయలను గౌరవించడం. మనకు నచ్చిందే చేస్తామనడం ఎంతమాత్రం ప్రజాస్వామ్యం కాదు. నేను ఎప్పుడూ అలా ఆలోచించ లేదు కూడా. అయితే, క్రమశిక్షణ ఉల్లంఘించడం, తప్పుడు విధానాలు అనుసరించడం, అక్రమాలకు పాల్పడటం వంటివి పెరుగుతూ పోతే నేను నియంతగా మారుతా. చర్యలు తీసుకుంటా. స్థానిక సంస్థల ప్రతినిధులకు మాత్రమే ఇది చెప్పడం లేదు, ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది'' అని స్టాలిన్ అన్నారు. మహిళా ప్రతినిధులు సైతం తమ భర్తలకు బాధ్యతలు అప్పగించరాదని సూచించారు.

Updated Date - 2022-07-05T00:28:46+05:30 IST