Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ నిలిపివేత

 హరారే: ఒమిక్రాన్ వేరియంట్‌ ప్రభావం క్రీడారంగంపై తీవ్రంగా పడింది. ఇప్పటికే పలు సిరీస్‌లు సందిగ్ధంలో పడగా తాజాగా దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ వాయిదా పడింది. దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సిన భారత జట్టు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. తాజా వేరియంట్ నేపథ్యంలో ఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.


జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీని నిలిపివేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఆఫ్రికా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధిస్తుండడంతో టోర్నీని నిలిపివేస్తున్నట్టు పేర్కొన్న ఐసీసీ.. శ్రీలంక-వెస్టిండీస్ జట్ల మధ్య నేడు జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. క్వాలిఫయర్ టోర్నీ ఆతిథ్య దేశమైన జింబాబ్వేలోనూ ప్రయాణ ఆంక్షలు విధించిన నేపథ్యంలో టోర్నీని కొనసాగించడం కష్టసాధ్యమైన పని అని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ పేర్కొన్నారు.  

Advertisement
Advertisement