మహిళా దినోత్సవం రోజు ఉద్యోగిణులకు సెలవు ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-02-27T04:52:02+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే మ హిళా ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వాలు సెలవు ప్రకటించాలని ఏపీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ డిమాండ్‌ చేశారు.

మహిళా దినోత్సవం రోజు  ఉద్యోగిణులకు సెలవు ప్రకటించాలి
ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న దండు వీరయ్య మాదిగ

ప్రొద్దుటూరు టౌన్‌, ఫిబ్రవరి 26:  అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే మ హిళా ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వాలు సెలవు ప్రకటించాలని ఏపీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవం నాడు  మహిళలతో పనులు చేయించుకోవడం దారుణమన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, నివారించడానికి ప్రతి నియోజకవర్గంలో మహిళా పోలీసు స్టేషన్‌ ఏర్పాటు  చేయాలన్నారు. మాదిగలు అధికంగా ఉన్న చోట  ఆ సామాజిక వర్గానికే టిక్కెట్టు ఇచ్చేలా  ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామన్నారు. 6వ వార్డులో మాదిగలు ఎక్కువగా ఉన్నారని, ఆ సామాజిక వర్గానికి చెందిన వెంకటమ్మకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు కేటాయించడం హర్షణీయమన్నారు.  కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు బాలలక్షుమయ్య మాదిగ, నాగభూషణం, సుధాకర్‌మాదిగ, కొండయ్య, వెంకటరమణ పాల్గొన్నారు. 

8న రాయలసీమ మహిళా సదస్సు

జమ్మలమడుగు రూరల్‌, ఫిబ్రవరి 26: మార్చి 8వ తేదీన అరుంధతీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని  కర్నూలుజిల్లా బెలూం గృహాలలో మహిళా సదస్సు  ఏర్పాటుచేశామని  ఏపీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ  పేర్కొన్నారు. ఆమేరకు శుక్రవారం జమ్మల మడుగులో కరపత్రాలను విడుదల చేశారు.  కార్యక్రమంలో ఏపీఎమ్మార్పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు తప్పెట తిరుమలయ్య, ఓబులేసు, సుబ్బరాయుడు, బాబు, రాములమ్మ, రామలక్షుమ్మ, భవానీ, కుళాయమ్మ, దస్తగిరమ్మ  పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:52:02+05:30 IST