మహిళలను ప్రోత్సహించడంలో పురుషులకు సమాన పాత్ర- మాధవి దేవి

ABN , First Publish Date - 2021-03-09T00:27:22+05:30 IST

సిజిఓ టవర్స్ లోని పత్రికా సమాచార కార్యాలయం(పీఐబీ) లో సోమవారం మహిళా దినోత్సవం వేడుకలు జరిగాయి.

మహిళలను ప్రోత్సహించడంలో పురుషులకు సమాన పాత్ర- మాధవి దేవి

హైదరాబాద్: సిజిఓ టవర్స్ లోని పత్రికా సమాచార కార్యాలయం(పీఐబీ) లో సోమవారం మహిళా దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా 2021 మహిళా దినోత్సవ ప్రచార థీమ్ అయిన ‘చూస్ టు ఛాలెంజ్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ సభ్యురాలు మాధవి దేవి ఆదాయపు , పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్, డైరెక్టర్ జనరల్ పిఐబి సౌత్ ఎస్. వెంకటేశ్వర్ ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం లో పాల్గొన్న అధికారులను ఉద్దేశించి మాధవి దేవి మాట్లాడుతూ, మహిళలు సాదించిన విజయాలు స్మరించుకోవడానికి, స్త్రీ- పురుష -సమాన ప్రపంచాన్ని సృష్టించడానికి, మహిళలను శక్తివంతం చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవడానికి మహిళా దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.


ఈ సంవత్సరం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క థీమ్ ‘చూస్ టు ఛాలెంజ్’ అని, అంటే దాని అర్థం.. మహిళలు తమ జీవితం లో ఎదురయ్యే సవాలు స్వీకరించి, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా జీవితంలో ముందుకు సాగి, తమ కలలు సాకారం చేసుకోవాలని తెలిపారు. మహిళలను ప్రోత్సహించడంలో పురుషులది కూడా సమానమైన పాత్ర ఉందనీ, తమ జీవితంలోని మహిళలకు, తాము పని చేసే కార్యలయాలలో మహిళలకు మద్దతు, తెలిపి వారి విజయాలకు స్పూర్తినివాల్సిన బాధ్యత పురుషుల పై కూడా ఉందన్నారు.


ఈ సందర్భంగా పి.ఐ.బి సౌత్ డైరెక్టర్ జనరల్ ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఆడ పిల్లలు, మగ పిల్లలలు అని పక్షపాతం చూపకుండా ఇద్దరినీ సమానంగా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్రికా సమాచార కార్యలయం & రీజనల్ బ్యూరోలో పని చేసే మహిళా అధికారులు తమ వృతిలో ప్రదర్శిస్తున్న అపారమైన అంకితబావానికి ఆయన అభినందించారు. వివిధ రంగాలలో భారత మహిళలు సాదించిన విజయాలను తెలిపే ఒక ప్రదర్శనను కార్యలయం ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పత్రికా సమాచార కార్యలయం, రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో, సాంగ్ అండ్ డ్రామా డివిజన్ కి చెందిన అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-09T00:27:22+05:30 IST